ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారింది 900 కియా కార్ల ఇంజన్స్ మాయం .. ఈ కేసులో పోలీసులు సైతం చాకచక్యంగా వ్యవహరించి తొందరగానే దొంగల్ని సైతం పట్టుకున్నట్లు తెలుస్తోంది.. ఈ కేసులో సుమారుగా తొమ్మిది మంది స్పెషల్ టీమ్ పోలీసులు గాలించి మరి అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. నిన్నటి రోజున రాత్రి వారందరినీ కూడా పెనుగొండ ప్రాంతానికి తీసుకు వచ్చినట్లు సమాచారం. అరెస్టు అయిన వారిలో 8 మంది తమిళనాడు ప్రాంతానికి చెందిన వారు అన్నట్లుగా తెలియజేశారు.


అయితే 900 ఇంజన్లు సైతం తీసుకువెళ్లినవారు కియాలో మాజీ ఉద్యోగస్తులగా పనిచేశారట.వారందరినీ సైతం అదుపులోకి తీసుకొని మరి విచారిస్తున్నారు పోలీసులు. అయితే ఈ 900 కార్ల ఇంజనీర్లని సైతం మాయం చేసినటువంటి ఈ ఘటనలో పటాన్ సలీంA1 ముద్దాయిగా ఉన్నారు. అలాగే 8 మంది తమిళనాడులోని రాణి పేటకు చెందిన వారు కాగా మరొకరు తిరుపతి వాసి .. వీరందరినీ కూడా పోలీసు అధికారులు తీసుకువచ్చారు. పెనుగొండ సీఐ కార్యాలయంలో నిందితులకు సంబంధించి అన్ని వివరాలను కూడా విచారించినట్లు తెలుస్తోంది. ఇలా రెండు రోజులపాటు విచారించిన అనంతరం పెనుగొండలో జడ్జి ముందు హాజరు పరిచినట్లు తెలుస్తోంది.


కియా నుంచి 900 ఇంజన్లు మాయమయ్యాయని విషయం ఆలస్యంగా ఎప్పుడు వెలుగులోకి వచ్చింది. మార్చి 19న పోలీసు అధికారులకు కియా యాజమాన్యం నుంచి కంప్లైంట్ రాగా దీంతో పోలీసుల సైతం రంగంలోకి దిగి కేవలం తక్కువ వ్యవధిలోనే ఈ ఇంజన్లకు చోరీకి సంబంధించి అన్ని విషయాలను కూడా వివరించినట్లు తెలుస్తోంది. 2020లో ఈ ఇంజన్ల చోరీ మొదలయ్యిందని ఈ వ్యవహారం సుమారుగా ఐదేళ్లపాటు కొనసాగింది అంటూ కియా అధికారులకు పోలీసులు తెలియజేశారు..ఈ కేసు చాలా లోతుగా దర్యాప్తు చేస్తున్నామంటూ  పోలీస్ అధికారులు తెలియజేయడం జరిగింది. మొత్తానికి కియా కార్ల దొంగతనాన్ని ఛేదించడంతో అటు ఉద్యోగులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. 2019లో మొదటిసారి కియా నుంచి మొదటి కారు మార్కెట్లోకి విడుదలయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: