- ( హైద‌రాబాద్ - ఇండియా హెరాల్డ్ ) . . .

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చమని బిల్డర్లు, పారిశ్రామిక వేత్తలు అడుగుతున్నారని ఇందుకు అవ‌స‌రం అయిన
ఎమ్మెల్యేలను కొనేందుకు ఎంత డబ్బు అయినా సమకూరుస్తామని చెబతున్నామని బీఆర్ఎస్ కు చెందిన కీల‌క నేత . . ఆ పార్టీ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు బీఆర్ ఎస్ పార్టీకే తీవ్ర నష్టం కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్క‌డ ప్ర‌భాక‌ర్ రెడ్డి రేవంత్ రెడ్డిని ఎలెర్ట్ చేసిన‌ట్టుగా క‌నిపిస్తోంది. కాంగ్రెస్ పైకి ఎలా స్పందించినా అంతర్గతంగా మాత్రం తమ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు మరింత ప్రయత్నాలు చేయకుండా ఉండద‌నే చెప్పాలి.


ఈ విష‌యంలో బీఆర్ ఎస్ ఎమ్మెల్యే గా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వం గురించి ఇలా మాట్లాడటం రెండు రకాలుగా చూడాలి. ఇందులో ఒక‌టి  మైండ్ గేమ్ లో భాగంగా మాట్లాడటం.. రెండోది శ్రేయోభిలాషి మాదిరిగా జాగ్రత్త పడండని హెచ్చరికలు జారీ చేశారా ? అన్న చ‌ర్చ‌లు కూడా న‌డుస్తున్నాయి. ప్ర‌భాక‌ర్ రెడ్డి ఉద్దేశం ఏదైనా కూడా ఆయ‌న మాట‌లు ఇప్పుడు కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని .. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని కాస్త ఎలెర్ట్ చేసిన‌ట్టుగా ఉన్నాయి. ఇక ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ముందస్తు లీక్ ఇచ్చారా ? అన్న చ‌ర్చ కూడా తెర‌మీద‌కు వ‌చ్చింది.


తెలంగాణలో రాజకీయ పరిస్థితులు అంత బ‌లంగా లేవు. రేవంత్ ప్ర‌భుత్వం ఉంద‌ని దూకుడు నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. అటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప‌ద‌వుల కోసం రేవంత్ ను బెదిరించేలా మాట్లాడుతున్నారు. కొంద‌రు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దేనికైనా సిద్ధం అనేట్టుగా తెగింపు ధోర‌ణి తో ఉన్నారు. అందుకే ఈ త‌ర‌హా అనుమానాలు కూడా వ‌స్తున్నాయి. ఏదేమైనా ప్ర‌భాక‌ర్ రెడ్డి వ్యాఖ్య‌లు కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ఎలెర్ట్ చేసేందుకు ఉప‌యోగ ప‌డుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: