కూటమిలో భాగంగా బిజెపి, జనసేన, టిడిపి పార్టీలు ఏపీలో కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా అన్నిటిలో కూడా పొత్తు ధర్మాన్ని పాటిస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలోనే ఏపీలో ఎలాంటివి జరిగినా కూడా ప్రధాన నరేంద్ర మోడీ కూడా వస్తూ అన్నిటిలో పాల్గొంటూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి పునః ప్రారంభానికి ప్రధాన నరేంద్ర మోడీ కూడా షెడ్యూల్ ని ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. మే రెండవ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు రాజధాని పనులను మొదలుపెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది ఏపీ ప్రభుత్వం.

ఈ కార్యక్రమం కోసం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సచివాలయం వెనుక బహిరంగ సభను కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అక్కడి నుంచే రాజధానికి సంబంధించి అన్ని పనులను కూడా ప్రారంభించేందుకు ఒక కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఉమ్మడి గుంటూరు ,కృష్ణ, పశ్చిమగోదావరి జిల్లా, ప్రకాశం నుంచి కూడా భారీగానే ప్రజలు హాజరు అయ్యేందుకు ప్లాన్ చేసింది ఏపీ ప్రభుత్వం. ప్రధాని పర్యటన ఏర్పాట్లు కోసం మంత్రులు కూడా పలు రకాల కమిటీలు వేసి మరి పనులు చేసేలా నిర్ణయాలు తీసుకున్నారు.


అలాగే భద్రత విషయంలో కూడా ప్రత్యేకంగా బృందాలు పర్యవేక్షిస్తున్నాయి. మరొకవైపు ఈ కార్యక్రమానికి ఇప్పటికే ఐదు లక్షల మంది హాజరు అవుతారని అంచనా ఏపీ ప్రభుత్వం వేసినట్లు తెలుస్తోంది. అలాగే పర్యటన నోడల్ అధికారి వీర పాండ్యన్ కూడా అన్ని విధాలుగా పనులు చక చక జరిగిపోవాలి అంటూ అధికారులను కూడా ఆదేశాలను జారీ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రజలతో పాటుగా ప్రముఖులు కూడా చేరుకునేలా తొమ్మిది రహదారులను గుర్తించినట్లు తెలుస్తోంది. ఆయా రహదారుల పైన ఎక్కడ కూడా వాహనాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలి అంటూ అధికారులను కూడా ఆదేశాలను జారీ చేశారట. మరి మీ రెండవ తేదీన ప్రధానమంత్రి రాకతో అమరావతి పునర్ ప్రారంభం కార్యక్రమం సక్సెస్ అవుతుందని కూటమినేతలు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: