వైసిపి పార్టీలో కీలకంగా పనిచేసిన మాజీ మంత్రి రోజా తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై చేసిన కామెంట్లు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. రోజా చేసిన ఈ కామెంట్ల కారణంగా జనసేన అభిమానులందరూ రోజాపై ఫైర్ అవుతున్నారు.మరి ఇంతకీ రోజా ఏం మాట్లాడింది..ఎందుకు జనసేన నాయకులు ఫైర్ అవుతున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి తిరుమలలో ఏదో ఒక వివాదం బయటికి వస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఇదిలా ఉంటే తాజాగా తిరుమలలోని గోశాలలో ఆవులు చనిపోయాయంటూ టిటిడి మాజీ చైర్మన్ భూమాణ కరుణాకర్ రావు ఆరోపించిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ వ్యాఖ్యలపై వైసీపీ మాజీమంత్రి రోజా మాట్లాడుతూ.. సనాతన ధర్మం అంటూ పట్టుకు తిరిగే పవన్ కళ్యాణ్ ఎందుకు ఏపీలో తిరుమల దేవస్థానం లో ఇన్ని అపచారాలు జరిగితే స్పందించడం లేదు.

 సనాతన ధర్మం అని దేశమంతా తిరుగుతున్నారు.కానీ రాష్ట్రంలో జరిగేది కనిపించడం లేదా..తిరుమల స్వామివారి సన్నిధానంలో అపచారం చేస్తే ఎలా ఉంటుందో చంద్రబాబుకు గతంలోనే తెలిసి వచ్చింది. ఇక డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ కి కూడా ఈ మధ్యకాలంలో లోనే కాస్తంత రుచి చూసాడు.. ఎందుకు తిరుమలలో అపచారాలు జరిగితే స్పందించడం లేదు. తిరుమలలో అపచారం చేసినవారు ఎవరైనా సరే కఠినంగా వ్యవహరించాలి. కఠిన కేసులు పెట్టాలి.కానీ ఈ ఇష్యూపై ఎందుకు మాట్లాడటం లేదో.. దేవుడితో పెట్టుకుంటే బాగుండదు.. అలాగే వాళ్ళందరూ ఆడంగి వెధవలు అంటూ రోజా ఘాటు వ్యాఖ్యలు చేసింది.

అయితే రోజా మాటలపై జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే రోజా పవన్ కళ్యాణ్ కి ఈ మధ్యనే ఆ దేవుడితో పెట్టుకుంటే ఏం జరిగిందో కాస్తంత రుచి చూసాడు అని చెప్పడంతో అందరూ పవన్ కొడుకు మార్క్ శంకర్ గురించే ఆరోపించిందని, అంత చిన్న బాబు అగ్నిప్రమాదంలో చిక్కుకొని ప్రాణాలతో బయటపడితే రోజా అలాంటి మాటలు మాట్లాడడం.. దేవుడికి ఆ చిన్న బాబుకి లింక్ చేయడం ఏమాత్రం బాగోలేదు అని రోజాపై ఫైర్ అవుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: