ఆంధ్రప్రదేశ్ కు చరిత్రలో ఎన్నడూ లేని అతి పెద్ద పెట్టుబడి రాబోతోంది.. అక్షరాలా లక్ష కోట్ల రూపాయల పెట్టుబడితో నెల్లూరు జిల్లాలో సెమీకండక్టర్ చిప్ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ప్రపంచ సెమీకండక్టర్ రంగంలో అగ్రగామిగా ఉన్న ఎన్విడియా కంపెనీ ఇక్కడ ప్లాంట్‌ను స్థాపించనుంది. ఇది రాష్ట్రానికి గేమ్ ఛేంజర్ అవుతుందని, వేలాది ఉద్యోగాలు, ఆర్ధిక ప్రగతి వేగవంతం అవుతుందని అంతా ఆశల పల్లకిలో తేలియాడుతున్న వేళ.. అమెరికా నుంచి ఒక పిడుగులాంటి వార్త వచ్చి పడింది.

అవును.. సెమీకండక్టర్ల తయారీకి అవసరమైన కీలక ముడిసరుకుల్లో ఒకటైన సిలికా, క్వార్ట్జ్ వంటివి మన ఆంధ్రప్రదేశ్ ఇసుక, మట్టి నుంచే వస్తాయి. ఇక్కడ తక్కువ ధరకు తవ్వి బయటి దేశాలకు పంపుతుంటే, వాళ్ళు దానిని ప్రాసెస్ చేసి అత్యంత ఖరీదైన చిప్‌లను తయారుచేసి ప్రపంచానికి అమ్ముకుంటున్నారు. ఇప్పుడు ఆ అత్యంత విలువైన తయారీ రంగం మన రాష్ట్రానికి వస్తుందంటే.. గ్లోబల్ పాలిటిక్స్ రూపంలో అడ్డంకులు మొదలయ్యాయి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రభుత్వ హయాంలో ఎన్విడియా కంపెనీపై కీలక ఆంక్షలు విధించారు. ముఖ్యంగా చైనా మార్కెట్ కోసం ఉద్దేశించిన అధునాతన హెచ్20 చిప్‌లను లక్ష్యంగా చేసుకుని నిషేధం ప్రకటించారు. ఇది అమెరికా – చైనా మధ్య నడుస్తున్న టెక్ వార్ లో భాగం.

కానీ, ఇప్పుడు ఈ నిషేధం ప్రభావం నేరుగా ఆంధ్రప్రదేశ్ కు వస్తున్న లక్ష కోట్ల ప్రాజెక్టుపై పడే ప్రమాదం ఏర్పడింది. ఎన్విడియా తన విస్తరణ ప్రణాళికల్లో భాగంగా నెల్లూరును ఎంచుకున్న నేపథ్యంలో.. అమెరికా విధించిన ఈ బ్యాన్ వారి వ్యాపార ప్రణాళికలపై, తద్వారా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టబోయే ప్లాంట్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది.

రాష్ట్రానికి ఇంత పెద్ద పెట్టుబడి వస్తుంటే ఇలాంటి గ్లోబల్ పొలిటికల్ ఇష్యూ రూపంలో అడ్డంకి రావడం దురదృష్టకరం. ఈ ప్రాజెక్టు విజయవంతం కావాలంటే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత వేగంగా స్పందించి.. దౌత్యపరమైన మార్గాల్లో అమెరికాపై ఒత్తిడి తేవాలి. ఎన్విడియాకు విధించిన ఈ నిషేధం వల్ల ఆంధ్రప్రదేశ్ లోని కొత్త ప్లాంట్ కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక వెసులుబాటు కల్పించేలా లాబీయింగ్ చేయాలి.

లేదంటే.. నెల్లూరులో వెలగాల్సిన సెమీకండక్టర్ కాంతి.. అమెరికా-చైనా టెక్ వార్ చీకట్లో మసకబారి.. లక్ష కోట్ల పెట్టుబడి కల ఆంధ్రప్రదేశ్‌కు చేజారే పెను ప్రమాదం ఉంది. ఈ క్లిష్ట పరిస్థితిని ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: