వైసిపి పార్టీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పైన గత కొన్నేళ్లుగా ఎన్నో కేసులు తన మీద ఉన్నాయి. కానీ వాటన్నిటినీ లెక్క చేయకుండా ముందుకు వెళ్తున్నారు. 47 ఏళ్ల రాజకీయ జీవితం అందులో 44 టిడిపి పార్టీలోనే ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి తాను ఎవరెవరో మీదను కేసులు పెట్టించడం ఎవరినైనా జైలు పాలు చేయడం.. లేకపోతే ఎవరి మీదైనా విచారణ చేర్పించడం తెలుసు కానీ.. తనే విచారణ ఎదురుకున్న సందర్భం లేదు.. చంద్రబాబు జైలుకు వెళ్లిన సందర్భం లేదు.. మొదటిసారి జగన్మోహన్ రెడ్డి తనని 16 నెలల పాటు సోనియా గాంధీ జైల్లో పెట్టించలేదు..


అప్పుడు చంద్రబాబు నాయుడు ఆనాడు జైల్లో పెట్టించారనీ ..సోనియాగాంధీతో కలిసి కుమ్మక్కై అన్నటువంటి వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అయితే ఈ కసి ప్రతికారంగానే.. ఏదైతే చంద్రబాబు అధికారంలో ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణానికి సంబంధించి.. జరగలేదని టిడిపి నేతలు జరిగిందని వైసీపీ ఆరోపణలతో చివరికి కోర్టు అరెస్టు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని జైలుకు పంపించడం జరిగింది చంద్రబాబును. ఆ సమయంలో ఒక్కక్షణం కూడా ఊపిరి పీల్చుకోవడానికి లేని పరిస్థితులలో ఉన్నారు చంద్రబాబు.


చంద్రబాబుకి అనారోగ్య సమస్య కారణంగా నిరంతరం అంబులెన్స్ తోడుగా ఉండాలి.. అంతటి తీవ్ర అనారోగ్య కారణం చేత చంద్రబాబుకు బెయిల్ ఇవ్వడం అవసరమని డాక్టర్లు ఇచ్చిన నివేదిక ఆధారంగా చంద్రబాబుకు బెయిల్ రావడం జరిగింది. ఆ తర్వాత వారం రోజులకి రెగ్యులర్ వీలు కూడా వచ్చేసింది. అప్పటినుంచి టిడిపి నేతలు చాలా ఆగ్రహంతో ఉన్నారు దీంతో ఎక్కడెక్కడ ఉండే టిడిపి నేతలు అందరూ కూడా ఏకమయి చివరిగా చంద్రబాబు నాయుడుని అధికారంలోకి తీసుకువచ్చేందుకు చేసిన ప్రయత్నం సక్సెస్ అయ్యింది.


అయితే ఆ నేతలు అందరూ కూడా అదే జైల్లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని పెట్టాలి అన్నది ఆనాడు చంద్రబాబుని అడిగారట.. అయితే అదే రాజమండ్రి జైల్.. ఇప్పుడు అందుకు అనుగుణంగానే కథ నడుస్తున్నట్లు కనిపిస్తోంది. ఏదైతే లిక్కర్ కుంభకోణంలో ప్రాథమికంగా సిఐడి తీసుకున్నటువంటి సమాచారం కావచ్చు.. సిట్ దగ్గర ఉన్న సమాచారం ప్రకారం.. లిక్కర్స్ స్కాములో కొన్ని వందల కోట్ల రూపాయల సొమ్ముని దోచేశారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. అలా రాజా కసిరెడ్డి ఇంట్లో సోదాలు అన్నీ కూడా చేస్తూ ఉన్నారు.. ఇంకా కొనసాగిస్తూ సోదాలు ఉంటామంటూ తెలుపుతున్నారు.. చివరికి 300 కిలోల బంగారు కొన్నారని విధంగా ఆరోపణలు చేస్తున్నారు. మరి వీటి మీద కసిరెడ్డి ఎలాంటి సమాధానం చెబుతారు.. వీటన్నిటిని బేస్ చేసుకుని జగన్ ని అరెస్ట్ చేయాలని చేయాలనే విధంగా ప్లాన్ చేస్తున్నారట.. అంతేకాకుండా గతంలో మిధున్ రెడ్డి, విజయసాయిరెడ్డి వంటి వారి పేర్లు కూడా తీసుకురావడంతో వారికి నోటీసులను ఇచ్చారు. ఇదంతా ఒక కథ నడుస్తున్నటువంటి వేళ.. కసిరెడ్డి దొరికితే జగన్ పేరు చెప్పించడం లేదా డిస్ట్రిబ్యూటర్ల చేత జగన్ మీద కంప్లైంట్ ఇప్పించడం.. ఇలా ఏది ఏమైనా కూడా మాజి సీఎం జగన్మోహన్ రెడ్డిని ఆరు నెలలు లేదా ఏడాదిలోపు జైలుకు పంపించాలని చూస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: