
గిరిజనులకు అవసరమైన చెప్పుల గురించి సర్వే చేయించి పవన్ కళ్యాణ్ వాళ్ల సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేశారు. అల్లూరి జిల్లాలోని పెదపాడుకు చెందిన గ్రామ ప్రజల కోసం పవన్ చేసిన ఈ పనిని ఎంత మెచ్చుకున్నా తక్కువేనని చెప్పవచ్చు. ఈ గ్రామంలొ పవన్ పర్యటించిన సమయంలో పాంగి మిత్తు అనే వృద్ధురాలు పవన్ కు స్వాగతం పలికారు.
అయితే ఆ వృద్ధురాలు చెప్పులు లేకుండా పవన్ కు స్వాగతం పలకడం గమనార్హం. అది చూసి చలించిపోయిన పవన్ గ్రామంలోని ప్రజలకు అవసరమైన చెప్పులను కొనుగోలు చేయించారు. తమ కష్టం తెలుసుకుని సాయం చేసిన పవన్ పై నెటిజన్ల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్ లో కూడా హీరోనే అని చెప్పడంలో సందేహం అవసరం లేదు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భాషతో సంబంధం లేకుండా తన సినిమాలతో రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ బావిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో సైతం మరిన్ని రికార్డులు క్రియేట్ చేస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. పవన్ ఇప్పటికే ప్రకటించిన సినిమాలను ఎప్పటికి పూర్తి చేస్తారో చూడాల్సి ఉంది. రెండు పడవల ప్రయాణం పవన్ కు ప్లస్ అవుతుందో లేదో చూడాలి.