
త్వరలోనే ఇండియాలో 2000 రూపాయలకు పైగా ట్రాన్సాక్షన్ చేస్తే 18% చొప్పున జీఎస్టీ ని వసూలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి అందుకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా కూడా కొన్ని పోస్టులు కూడా వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా పన్ను ఆదాయాన్ని సైతం పెంచుకునేందుకు దీనిని ఒక పెద్ద మార్గంగా కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇది అమలులోకి వస్తే సాధారణ ప్రజల నుంచి చిరు వ్యాపారాలకు భారీ దెబ్బ పడుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ప్రతి ఒక్కరూ కూడా క్యూఆర్ కోడ్ ని పెట్టుకొని మరి తిరుగుతూ ఉన్నారు. ఇలా డిజిటల్ పేమెంట్స్ సెక్షన్ లో అందరూ ఉన్న సమయంలోనే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో ఖచ్చితంగా డిజిటల్ చెల్లింపు చర్యలు తగ్గిపోతాయని కూడా ప్రజలు భావిస్తున్నారు. ఒకవేళ ఇది అమలులోకి అయితే మళ్లీ పాత పద్ధతిలోకి ప్రజలు అలవాటు పడిపోతారని పలువురు నిపుణులు కూడా తెలియజేస్తున్నారు. గతంలో లాగా మళ్లీ డబ్బుల కోసం పడి కాపులు కాస్తూ బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.అయితే ఈ విషయం పైన కేంద్ర ప్రభుత్వం కూడా ఇవన్నీ ఎలాంటి ఆధారాలు లేని రూమర్స్ అంటూ కొట్టి పారేసినట్లు సమాచారం.