
కానీ రోజుల పాటు మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఉండటం లేదు. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఏపీ నుంచి వైసీపీ నేతలను రప్పించుకొని బెంగళూరు ప్యాలస్ లోనే చర్చలు చేస్తున్నారు. వైయస్ భారతి అలాగే జగన్మోహన్ రెడ్డి సమక్షంలోనే ఈ చర్చలు జరుగుతున్నాయని సమాచారం అందుతుంది. అయితే.. ఈ మధ్యకాలంలో వైసీపీ పార్టీని బలోపేతం చేసేందుకు జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే పలు... పదవులను కూడా భర్తీ చేశారు జగన్మోహన్ రెడ్డి.
ఇందులో పిఎసిలో ముద్రగడ పద్మనాభ రెడ్డి కి అవకాశం వచ్చింది. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డికి కూడా కీలక పదవి అప్పగించారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇలాంటి నేపథ్యంలో ఏపీ రాజకీయాలను కుదిపేసే ఒక అంశం తెరపైకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైయస్ భారతికి కీలక పదవి ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారట. ఆమెకు సోషల్ మీడియా అలాగే మీడియాకు సంబంధించిన విభాగాన్ని అప్పగించేందుకు రంగం సిద్ధం చేసిందట వైసీపీ పార్టీ.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ... అధికార కూటమి ప్రభుత్వాన్ని... దించేలా పనిచేసే టీం ను బరిలోకి దింపనున్నారట జగన్మోహన్ రెడ్డి. అయితే ఈ విభాగానికి వైయస్ భారతి ప్రాతినిధ్యం వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఆమెకు బాధ్యతలు ఇస్తే.. కచ్చితంగా సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుందని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారట. అందుకే వైయస్ భారతి కి ఆ పదవి కట్ట పెట్టాలని అనుకుంటున్నారట.