ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయ సాయి రెడ్డి ఎపిసోడ్ ఇంకా కూడా కొనసాగుతోంది. రాజకీయాలనుంచి విజయసాయిరెడ్డి తప్పుకున్నప్పటికీ... ఏదో అంశం ద్వారా విజయసాయిరెడ్డి... హైలెట్ అవుతున్నారు. అయితే తాజాగా సిట్ విచారణకు వచ్చిన విజయసాయిరెడ్డి... వైసీపీ పార్టీపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా వైసిపి పార్టీ నుంచి బయటికి రావడం పైన స్పందించారు విజయసాయిరెడ్డి. ఓ కోటరీ వ్యవస్థ కారణంగా వైసిపి పార్టీ నుంచి బయటికి రావాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

 2014 నుంచి  2019 వరకు వైసిపి పార్టీని సింగిల్ హ్యాండ్  తో నడిపినట్లు పేర్కొన్నారు విజయసాయిరెడ్డి. అయితే 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత.... తనకు ప్రాధాన్యత తగ్గిందన్నారు. అధికారం వచ్చిన ఆరు నెలలకే నన్ను... రెండవ స్థానం నుంచి 2000 స్థానానికి తీసుకువెళ్లారని మండిపడ్డారు  మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి. కోటరీ సభ్యులు అంతా తన పైన.. వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి లేనిపోని అబద్ధాలు చెప్పి దూరం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


మా అప్పటి నాయకులు వైయస్ జగన్మోహన్ రెడ్డి  మనసులో నాకు స్థానం లేదని  వైసిపి పార్టీని వీడానని తెలిపారు. ఇక మళ్లీ రాజకీయాల్లోకి రావడం పైకి నా కూడా క్లారిటీ ఇచ్చారు. నేను మళ్లీ రాజకీయాల్లోకి రావాలంటే ఎవరి పర్మిషన్ తీసుకోవాల్సిన పనిలేదని.. స్పష్టం చేశారు విజయ సాయి రెడ్డి. అంటే తనకు నచ్చితే మళ్ళీ రాజకీయ రంగ ప్రవేశం ఉంటుందని చెప్పకనే చెప్పారు విజయ సాయిరెడ్డి.


ఇది ఇలా ఉండగా..... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా ఓ రాజ్యసభ సీటు ఖాళీ అయిన సంగతి తెలిసిందే. అయితే... ఆ స్థానంలో విజయసాయిరెడ్డి మరోసారి  ఎంపిక అవుతారని ప్రచారం జరిగింది. బిజెపి పార్టీ తరఫున విజయసాయిరెడ్డికి టికెట్ వస్తుందని అందరు ఆశించారు. కానీ చివరికి విజయసాయిరెడ్డికి కాకుండా తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన అన్నామలై  కి అవకాశం ఇవ్వబోతుందట బిజెపి పార్టీ. దీంతో విజయసాయి రెడ్డికి ఊహించని షాక్ తగిలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: