
మ్యారేజ్ బ్యూరో హెర్బల్ ప్రొటెక్షన్ అంటూ ఒక యాప్ ని క్రియేట్ చేసి ఒక ముఠా పెళ్లి కాని అమ్మాయిల వివరాలను సైతం సేకరించి ఆ తర్వాత పరిచయం ఏర్పరచుకొని ప్రేమ అంటూ వెంటపడి వారిని ముగ్గులోకి దింపి మరి కూల్ డ్రింక్ ఇచ్చి మత్తుమందు కలిపి మరి యువతులపైన అత్యాచారం చేస్తున్నారంటూ ఆ యువతి తెలియజేసింది. అంతేకాకుండా ఆ వీడియోలను తీసి మరి ఆ తర్వాత వారు పిలిచినప్పుడు రాకపోతే ఆ వీడియోలను పోర్న్ సైట్లో పెడతామంటూ యువతులను బెదిరిస్తున్నారట.
అలా కొంతమంది కేటుగాళ్లు ప్రతిరోజు తమ కోరికలను తీర్చుకుంటున్నారు అంటూ యువతి తెలియజేసింది.ఈ క్రమంలోనే వీరి వల్ల బలైన యువతి గర్భం దాల్చడంతో ఆ యువతీకి బలవంతంగా అబార్షన్ చేయిస్తున్నారు అంటూ ఆ బాధితురాలు తెలియజేస్తోంది .ఒకవేళ అబార్షన్ చేయించుకోకపోతే ఆ యువతులను చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని తెలియజేస్తూ ఈమె పోలీసులను ఆశ్రయించింది. అయితే ఈ విషయం పైన పోలీసులను ఆశ్రయించగా అలా వెళ్లడం మీదే తప్పు అంటూ నిందితుల వైపు గానే మాట్లాడుతున్నారని దీంతో యువతి మీడియాను సైతం ఆశ్రయించిన ఆ యువతి మీడియా ముందు అన్ని విషయాలను చెప్పేసింది.