
ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి దాదాపు 70కు పైగా నియోజకవర్గాలలో ఇన్చార్జులు లేని పరిస్థితి. గత ఎన్నికలలో వైసిపి ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీ నుంచి పలువురు కీలక నేతలు బయటకు వెళ్లిపోతున్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు.. మాజీ ఎంపీలు.. జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్న వారితో పాటు చివరకు రాజ్యసభ సభ్యులుగా ఉన్నవారు సైతం తమ ఎంపీ పదవి వదులుకొని వైసీపీకి రాజీనామా చేసి బయటికి వెళ్లిపోతున్నారు అంటే వైసీపీపై వారికి ఎలాంటి నమ్మకాలు లేవని అర్థమవుతుంది. ఇది ఇలా ఉంటే పార్టీ అధినేత జగన్ వచ్చే ఎన్నికలకు ఇప్పటినుంచే సిద్ధమవుతున్నారు. పలు నియోజకవర్గాలలో కొత్తవారితో అభ్యర్థులను భర్తీ చేస్తూ కొన్నిచోట్ల మార్పులు చేస్తూ ముందుకు వెళుతున్నారు. ఈ క్రమంలోని వైసీపీకి నాలుగు నియోజకవర్గాలలో కొత్త అభ్యర్థులు రాబోతున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికలలో పాలకుల నుంచి పోటీచేసి మంత్రి నిమ్మల రామానాయుడు చేతిలో ఓడిపోయిన గుడాల గోపిని ఇప్పుడు ఆచంట నియోజకవర్గానికి మరుస్తున్నట్టు తెలుస్తోంది.
గోపి శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కాగా ప్రస్తుతం అక్కడ టిడిపి నుంచి అదే సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ క్రమంలో గోపిని కూడా సామాజిక సమీకరణల కోణంలో ఆచంటకు మార్చాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. పాలకొల్లులో నిమ్మల రామానాయుడు కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కాగా.. అక్కడ కూడా అదే కాపు వర్గానికి చెందిన నాయకుడికి అవకాశం ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. గుణ్ణం నాగబాబు లేదా మరో కాపు నేతకు పాలకొల్లు పగ్గాలు ఇస్తారని తెలుస్తోంది.
ఇక మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు నెల్లూరు సిటీ నుంచి కాకుండా వెంకటగిరి పగ్గాలు అప్పగించే ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రాజమండ్రి రూరల్ నియోజకవర్గ పగ్గాలు జక్కంపూడి బ్రదర్స్ లో చిన్నవాడు జక్కంపూడి గణేష్ కు ఇస్తారని సమాచారం. ప్రస్తుతం రాజామండ్రి రూరల్ ఇన్చార్జిగా ఉన్న మాజీ మంత్రి చెల్లుబోయిన వేణును రామచంద్రపురంకు పంపుతారని సమాచారం. ఏది ఏమైనా జగన్ పక్కా ప్రణాళికలతో ఇప్పటినుంచే ముందుకు వెళుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ వాట్సాప్ నెంబర్‌తో సమస్య మీది.. పరిష్కారం మాది..
అవినీతి అయినా.. లంచాలైనా.. రాజకీయ నాయకులు పెట్టే ఇబ్బందులు అయినా మీ సమస్యను మా సమస్యగా భుజాన వేసుకుంటాం. నేతలు పట్టించుకోవడం లేదని.. అధికారులు దురుసుగా వ్యవహరిస్తున్నారని చింతించాల్సిన అవసరమే లేదు. రండి.. చేయి చేయి కలుపుదాం.. మీ చింత తీర్చుదాం. మీ సమస్య ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.. పరిష్కార మార్గాన్ని పొందండి.