ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ కుమార్తె వివాహం తాజాగా కన్నుల పండుగగా నిర్వహించారు. హర్షితా కేజ్రీవాల్, సంభవ్ జైన్ వివాహం శుక్రవారం ఢిల్లీలోని కపూర్తలా హౌస్‌లో అతిరథమహారధుల మధ్య చాలా ఘనంగా నిర్వహించారు. మాజీ మహారాజా ఆఫ్ కపూర్తలా నివాసం పరిసర ప్రాంతాల్లో ఈ వివాహం జరిగినట్టు తెలుస్తోంది. హర్షితా, సంభవ్ జైన్ ఇద్దరూ ఐఐటీ (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) ఢిల్లీలో చదువుతున్న సమయంలో పరిచయం అయ్యారు. ఈ క్రమంలోనే వారి పరిచయం ప్రేమగా మారడంతో వివాహం చేసుకోవాలని అనుకున్నారు. వారి వివాహానికి ఇరు కుటుంబాలు అంగీకారం తెలపడంతో తాజాగా వివాహంతో ఒక్కటయ్యారు.

మాజీ సీఎం కేజ్రీవాల్ తన కూతురి వివాహం తన చేతుల మీదుగా నిర్వహించారు. ఈ వివాహం కార్యక్రమాన్ని సన్నిహిత కుటుంబ సభ్యులు, సన్నిహితులతో అత్యంత రంగరంగ వైభవంగా జరిపారు. దీనికి పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, మాజీ ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోదియా వంటి ప్రముఖులు హాజరయ్యారు. ఈ క్రమంలో పంజాబ్ సీఎం.. భగవంత్ మాన్ సంగీత్ కార్యక్రమంలో బాంగ్రా డాన్స్ చేసి ఆహుతులను అలరించారు. కాగా ఈ నూతన జంట ఇటీవల ఒక స్టార్టప్‌ను కూడా ప్రారంభించారు.

ఇక అరవింద్ కేజ్రివాల్ గురించి అందరికీ తెలిసిందే. భారతీయ సామాజికవేత్త, రాజకీయ నాయకుడు అయినటువంటి కేజ్రివాల్ హర్యానాలో జన్మించారు. ఐఐటి ఖరగపూర్ లో మెకానికల్ ఇంజనీరింగ్ లో పట్టభద్రులు అయ్యారు. మొదట భారతీయ రెవెన్యూ సర్వీసులో పనిచేసిన అనుభవం అతనికి కలదు. జన లోకపాల్ బిల్లు కోసం అన్నా హజారేతో కలిసి చేసిన పోరాటం, సమాచార హక్కు చట్టం కోసం చేసిన పోరాటంతో ఇతను దేశ వ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతలు గడించారు. సమాచార హక్కు చట్టం తీసుకురావటం, పేదవారి స్తోమత పెంచడానికి చేసిన కృషికి 2006లో రామన్ మెగసెసే అవార్డు కూడా అతనిని వరించింది. 2012 లో ఆమ్ ఆద్మీ పార్టీ అనే రాజకీయ పార్టీని స్థాపించి, తొలి ఎన్నికలైన 2013 ఢిల్లీ శాసనసభ ఎన్నికల విజయంతో ఢిల్లీ 7వ ముఖ్యమంత్రిగా పదవి చేబట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: