ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి విద్యార్థుల పరీక్ష ఫలితాల కోసం చాలా ఎక్సైటింగ్గా ఎదురుచూస్తున్నారు. అయితే గత కొద్దిరోజులుగా పరీక్షల ఫలితాల తేదీ పైన గందరగోళం నెలకొంటూనే ఉంది. ఇప్పటికే ఇంటర్ ఫలితాలు కూడా విడుదలయ్యాయి. దీంతో పదవ తరగతి ఫలితాల కోసం విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు కూడా చాలా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలోనే పరీక్ష ఫలితాల తేదీ పైన కూడా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ అధికారులు కీలకమైన అప్డేట్ని సైతం తెలియజేశారు. పదవ తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు చాలా సజావుగా సాగాయి.


ఈ పబ్లిక్ పరీక్షలకు 6,19,275 మంది రెగ్యులర్ విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు 5,64,064 మంది ఉండగా తెలుగు మీడియానికి సంబంధించి 51,000 మంది పైగా విద్యార్థులు పరీక్షలు రాసినట్లు తెలుస్తోంది. పరీక్షలు పూర్తి అయిన వెంటనే ఆలస్యం చేయకుండా వాల్యుయేషన్ ప్రక్రియను కూడా ఏపీ ప్రభుత్వం మొదలుపెట్టింది. అయితే ఈనెల 23వ తేదీన పరీక్ష ఫలితాలను రిలీజ్ చేయబోతున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలియజేశారు.


ఫలితాలను మన మిత్ర వాట్సాప్ నెంబర్ 9552300009 ద్వారా కూడా తెలుసుకోవచ్చు. వీటికి కేవలం హాయ్ అని నెంబర్ మెసేజ్ పెడితే చాలు ఆ తర్వాత విద్యా సేవలు ఎంచుకొని..SSC ఫలితాలు ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత హాల్ టికెట్ నెంబర్ ని ఎంటర్ చేయాలి. అప్పుడు పిడిఎఫ్ రూపంలో ఫలితాలు వెలుపడతాయి. అలాగే అధికారిక వెబ్సైట్ https://www.bse.ap.gov.in వెబ్సైట్ ద్వారా కూడా చూసుకోవచ్చు.


కానీ గత కొంతకాలంగా పరీక్ష ఫలితాల తేదీ పైన విద్యార్థులు తల్లిదండ్రులు సైతం తర్జనభజన అవుతున్న సందర్భంలో ఈ రోజున గడిచిన కొన్ని గంటల క్రితం విద్యాశాఖ కీలక అప్డేట్ విడుదల చేయడం జరిగింది. ఈనెల 23వ తేదీన పరీక్ష ఫలితాలను రిలీజ్ చేయబోతున్నామని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: