
ఉంబ్రియాలోని టెర్ని జైలులో శుక్రవారం తొలి మీటింగ్ గ్రాండ్ గా జరిగింది. ఒక ఖైదీ తన లవర్ తో కొత్తగా రెడీ చేసిన ప్రైవేట్ రూమ్ లో రొమాంటిక్ టైం స్పెండ్ చేశాడు. ఉంబ్రియా ఖైదీల హక్కుల ప్రతినిధి గియుసేప్ కాఫోరియో ఈ వ్యవహారంపై ఫుల్ హ్యాపీగా ఉన్నారు. "అంతా అనుకున్నట్టు జరిగిపోయింది. కానీ వాళ్ల ప్రైవసీకి మేం గ్యారంటీ. ఎవరి డీటెయిల్స్ బయటకు రావు" అని కాఫోరియో క్లారిటీ ఇచ్చారు. ఇది జస్ట్ స్టార్టింగ్ మాత్రమే అని, భవిష్యత్తులో ఇలాంటి మీటింగ్స్ చాలా ఉంటాయని ఆయన చెప్పేశారు.
ఈ సంచలన మార్పు వెనుక జనవరి 2024 కోర్టు తీర్పు ఉంది. ఖైదీలు తమ పార్టనర్స్ ని గార్డ్స్ కళ్లు గప్పి మరీ ప్రైవేట్ గా కలవొచ్చు అని కోర్టు కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. అంతేకాదు, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, స్వీడన్, నెదర్లాండ్స్ లాంటి చాలా యూరోపియన్ కంట్రీస్ లో ఇదివరకే "దాంపత్య సందర్శనలు" ఉన్నాయని కోర్టు గుర్తు చేసింది.
దీని కోసం ఇటలీ న్యాయ మంత్రిత్వ శాఖ కొత్త రూల్స్ పెట్టింది. ఆ రూల్స్ ప్రకారం, సెలెక్టెడ్ ఖైదీలు బెడ్, టాయిలెట్ ఉన్న స్పెషల్ రూమ్ లో తమ పార్టనర్స్ తో మీట్ అవ్వొచ్చు. ఈ మీటింగ్స్ మాగ్జిమం రెండు గంటలు ఉంటాయి. డోర్ లాక్ చెయ్యరు కానీ, కపుల్స్ కి మాత్రం ఫుల్ ప్రైవసీ ఉంటుంది. ఎమర్జెన్సీ ఉంటే తప్ప ఎవరూ డోర్ తీయడానికి వీల్లేదు.
ఇటలీ జైళ్లలో ఖైదీలు కిక్కిరిసిపోయి ఉన్నారు. 62 వేల మందికి పైగా జైలు జీవితం గడుపుతున్నారు. ఇది జైళ్ల కెపాసిటీకి 21% ఎక్కువట. ఇటీవల జైళ్లలో సూసైడ్ చేసుకునే వాళ్ల సంఖ్య కూడా పెరిగిపోయింది. అందుకే ఈ ప్రైవేట్ మీటింగ్స్ తో ఖైదీల మెంటల్ హెల్త్, ఎమోషనల్ వెల్ బీయింగ్ ఇంప్రూవ్ అవుతుందని అధికారులు భావిస్తున్నారు.