
ఇలాంటి సంఘటనలు చాలానే అప్పట్లో తెరపైకి వచ్చాయి. అయితే సభ పెడితే ప్రజాగ్రహం వస్తున్న తరుణంలో... అధికారులకే చెక్కులు అప్పగించి లబ్ధిదారులకు ఇచ్చేస్తున్నారట. అటు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. జీతాలకే దిక్కులేదు కానీ తులం బంగారం ఎక్కడి నుంచి తీసుకువస్తాం? అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారట సిపిఐ ఎమ్మెల్యే పూనమ్నేని సాంబశివరావు.
వాస్తవానికి గత 16 నెలల కిందట ఆరు గ్యారంటీలు ప్రకటించి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. గులాబీ పార్టీ గత పది సంవత్సరాల కాలంలో... అవినీతి చేసిందని... కాలేశ్వరం పేరుతో లక్షల కోట్లు దండుకున్నారని... కాంగ్రెస్ నేతలు ఎన్నికల సమయంలో చెప్పారు. అయితే అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలు అమలు చేసి... తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తామని హామీ ఇచ్చారు.
అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఫ్రీ బస్సు మాత్రమే... రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోంది. మిగిలిన సంక్షేమ పథకాలను అమలుపరిచే పరిస్థితి ఇప్పటికైతే లేదని కాంగ్రెస్ నేతలే చెబుతున్నారు. గత ప్రభుత్వ కాలంలో చేసిన అప్పులు.. కట్టడానికే బడ్జెట్ సరిపోవటం లేదని కాంగ్రెస్ నేతలు అసెంబ్లీ వేదిక ద్వారా చెప్పారు. ఇక ఇప్పుడు కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ విషయంలో కూడా కొత్త సమస్య వచ్చి పడింది.