దేశ వ్యాప్తంగా చాలా చోట్ల కూడా ఉచిత బియ్యం లేదా తక్కువ ధరకే బియ్యాన్ని ప్రభుత్వాలు తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి సప్లై చేస్తూ ఉన్నారు. అయితే ఈ బియ్యాన్ని కొంతమంది తింటూ ఉండగా మరి కొంతమంది అమ్మేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా టిడిపి నేత కాకినాడ జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కూడా కొన్ని రకాల సెటైరికల్ కామెంట్స్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే మంత్రి నాదెండ్ల మనోహర్ పైన పరోక్షంగా చురకలనిపించినట్లుగా కనిపిస్తోంది.


పవన్ కళ్యాణ్ గడిచిన కొన్ని నల క్రితం కాకినాడ పోర్టులో రేషన్ అక్రమంగా తరలిస్తున్న ఒక షిప్ ను సైతం సీజ్ చేయాలంటూ అక్కడికి వెళ్లి చాలా హడావిడి చేశారు.. కానీ అక్కడ పవన్ ఆదేశాలు పనిచేయలేదు.. అయితే ఆ షిఫ్ చక్కగా బియ్యాన్ని విదేశాలకు సైతం తీసుకువెళ్ళింది.. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీడియాతో మాట్లాడుతూ కాకినాడ కోర్టులో పట్టుబడిన బియ్యం చల్లబడిపోయిందని తెలిపారు.. అసలు ఎందుకు చల్లబడింది ?ఎలా చల్లబడిందో ఆ వెంకటేశ్వర స్వామికి తెలియాలి అంటూ తెలిపారు.


ఈ వ్యవహారంపై అటు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ,మంత్రి నాదెండ్ల మనోహర్ ను పరోక్షంగానే అన్నట్లుగా ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. అయితే ఈ వ్యవహారంలో కేవలం మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటనలకే పరిమితం కాకూడదంటూ తెలియజేశారట. రేషన్ వ్యవస్థను మరింత ప్రతిష్టాత్మకంగా చేయాలని సూచించారు. 30 రూపాయల బియ్యాన్ని రూపాయికి ఎవరు ఇవ్వమని చెప్పారు అంటూ నిలదీయడం జరుగుతోంది. తినే బియ్యం ఇస్తే.. వాటిని ప్రజలు  ఎందుకు అమ్ముకుంటున్నారు అంటూ టిడిపి సీనియర్ నేత జ్యోతిలో నెహ్రూ ప్రశ్నించడం జరుగుతోంది. 50 శాతం సబ్సిడీతో సన్న బియ్యం ఇస్తే ప్రజలు కొనలేరా అంటూ ఆయన ప్రశ్నించారు.. మొత్తానికి రేషన్ బియ్యం పైన ఈ నేత చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: