ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు ఇవాళ జరుపుకుంటున్నారు. అయితే సీఎం చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు నేపథ్యంలో... ఆయనకు దేశవ్యాప్తంగా... ఉన్న కీలక రాజకీయ నేతలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పుట్టినరోజు విషెస్ చెప్పడమే కాకుండా.... ఆయన నిండు నూరేళ్లు బతకాలని.. పేర్కొంటున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే... ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బర్త్ డే నేపథ్యంలో... ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్ సంచలన పోస్ట్ పెట్టారు.

 అనిత సాధ్యుడు చంద్రబాబు నాయుడు అంటూ పేర్కొన్నారు.  సీఎం చంద్రబాబు నాయుడు గారికి వజ్రోత్సవ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు పవన్ కళ్యాణ్. ఆర్థికంగా కుంగిపోయి... అభివృద్ధి అఘమ్యాచోరంగా తయారై... ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడిన... రియల్ హీరో చంద్రబాబు నాయుడు అంటూ వెల్లడించారు. శాంతిభద్రతలు శీనించి పోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతిని మళ్లీ గాడిలో పెట్టిన మొనగాడు అంటూ... చంద్రబాబు నాయుడు ను ప్రశంసించారు ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్.

 ఏపీని అభివృద్ధి చేయడం చంద్రబాబు లాంటి దాక్షకునికి మాత్రమే సాధ్యమన్నారు. అలాంటి పాలనా దక్షునికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ పోస్ట్ పెట్టారు పవన్ కళ్యాణ్. నాలుగో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న చంద్రబాబు నాయుడు... విజన్ అలాగే నిరంతరం పనిచేసే  ఉత్సాహం అద్భుతం అంటూ కొనియాడారు. భవిష్యత్తును ముందుగానే అంచనా వేసి అందుకు అనుగుణంగా వ్యవస్థలను నడిపించే చంద్రబాబు నాయుడు.. అందరికీ స్ఫూర్తిదాయకం అంటూ వెల్లడించారు ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్.

 వజ్రోత్సవ జన్మదిన శుభ సమయాన చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆయుష్షును సంపాదించుకొని ఆనందంగా గడపాలని.. భగవంతున్ని కోరుకుంటున్నట్టు పవన్ కళ్యాణ్ పోస్ట్ పెట్టడం జరిగింది. దీంతో సీఎం చంద్రబాబు నాయుడు బర్త్డే  నేపథ్యంలో శుభాకాంక్షలు చెప్పిన ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్ పోస్ట్ వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: