ఆంధ్రప్రదేశ్ సీఎం గా ఉన్న చంద్రబాబు నాయుడు  75వ పుట్టినరోజు ఈరోజు జరుపుకోబోతున్నారు.ఏప్రిల్ 20 1950లో చంద్రబాబు జన్మించారు. దీంతో ఈ రోజున అటు కార్యకర్తలతో పాటు కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున ఈ వేడుకలను చాలా గ్రాండ్ గా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రస్థానం ఏంటి ఆయన గురించి తెలియని కొన్ని విషయాలను ఇప్పుడు చూద్దాం.


1950 ఏప్రిల్ 20న చిత్తూరు జిల్లాలో నారావారిపల్లెలో చంద్రబాబు నాయుడు నారా ఖర్జూర నాయుడు , అమ్మనమ్మ జన్మించారు. చిన్న వయసు నుంచే నాయకుడు లక్షణాలు చాలా ఉండేవట చంద్రబాబు నాయుడులో.. అలా చంద్రబాబు నాయుడు 1978లో మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా చంద్రగిరి అసెంబ్లీ నుంచి పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అలా మొదటిసారి ఎమ్మెల్యేగా అయినా చంద్రబాబు మంత్రి పదవిని కూడా తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి 28 ఏళ్ల వయసులోనే మంత్రి పదవి చేపట్టిన అతి చిన్న నాయకుడిగా అరుదైన ఘనతను అందుకున్నారు.


అయితే అప్పటికే చంద్రబాబుకు వివాహం కాలేదు.. అలాంటి సమయంలో ఎన్టీ రామారావు తన కుమార్తె భువనేశ్వరుని ఇచ్చి పెళ్లి చేశారు.. అయితే 1983లో చంద్రగిరి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన చంద్రబాబు ఆ వెంటనే పార్టీని వీడి ఎన్టీఆర్ మొదలుపెట్టిన టిడిపి పార్టీలోకి చేరారు. అప్పుడు టిడిపి పార్టీలో చాలా కీలకంగా ఉన్నారు. ఈయన తెలివితేటలతో మరొకసారి సీనియర్ ఎన్టీఆర్ ను సీఎంగా అయ్యేలా చేశాయి. ఆ తర్వాత 1989లో కుప్పం నుంచి అసెంబ్లీకి పోటీ చేయక 5000 మెజార్టీతో విజయాన్ని అందుకున్నారు. అలా కాంగ్రెస్ పార్టీలో రాజకీయ మొదలుపెట్టి టీడీపీ పార్టీ అధినేతగా ఇప్పుడు కొనసాగుతూ ఉన్నారు.


చంద్రబాబు తన రాజకీయాలలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు.. అయితే టిడిపి పార్టీలో ఎదురైన కొన్ని అనూహ్య పరిణామాల వల్ల 1995 సెప్టెంబర్ 1న సీఎం గా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 1999లో సీఎంగా మరోసారి బాధ్యతలు చేపట్టారు.. ఇక 2003లో తిరుపతికి వెళుతూ ఉండగా నక్సలైట్లు చేసిన దాడిలో చంద్రబాబు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఎలక్షన్స్ కు ఏడాది ఇంకా ఎన్నికల సమయం ఉండగానే ముందస్తు ఎన్నికలు జరిగాయి.


కానీ 9 ఏళ్ల పాటు సుదీర్ఘ పరిపాలన చేసిన ఏకైక నాయకుడిగా పేరు సంపాదించారు. ఇక 2004లో వైయస్ రాజశేఖర్ రెడ్డి చేతిలో టీడీపీ పార్టీ ఓడిపోయింది. పదేళ్లపాటు అధికారాన్ని కోల్పోయారు. మళ్లీ 2014లో టిడిపి పార్టీ విజయం  అందుకోగా.. 2019లో వైసిపి పార్టీ చేతిలో ఓడిపోయింది. మళ్లీ ఇప్పుడు 2024లో టిడిపి పార్టీ అధికారం చేపట్టింది కూటమిలో భాగంగా.

చంద్రబాబు హైదరాబాద్ ఐటి అభివృద్ధిలో కూడా చాలా కృషి చేశారని ఇప్పటికి చాలామంది నేతలు చెబుతూ ఉంటారు. ఎప్పుడు టెక్నాలజీకి అనుగుణంగానే తన అడుగులు వేస్తూ ఉంటారు చంద్రబాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: