
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డికి పదవి ఇచ్చేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. షర్మిల గత ఎన్నికలకు ముందు రకరకాలుగా రాజకీయం చేశారు. 2019 ఎన్నికల్లో మాత్రం ఆమె వైసీపీ .. తన అన్న జగన్ గెలుపు కోసం రాష్ట్రం అంతటా కాలికి బలపం కట్టుకుని మరీ తిరిగారు. ఆ తర్వాత జగన్‌తో గ్యాప్ రావడంతో ఆమె తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టి అక్కడ రాజకీయం చేశారు. అయినా ఆమెను అక్కడ పట్టించుకున్న పరిస్థితి లేదు. యేడాదిన్నర పాటు భారీగా ఖర్చు చేసి మరీ తెలంగాణలో పాదయాత్ర చేసినా ఆమెకు ఏ మాత్రం మైలేజ్ రాలేదు.
తెలంగాణ ఎన్నికలకు ముందు ఆమె కాంగ్రెస్ లో చేరారు. అయినా ఆమెకు ఉపయోగం లేదు. చివరకు తాను కోరుకున్న పాలేరు అసెంబ్లీ సీటు కూడా రాలేదు. చివరకు ఆమె ను ఏపీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పగించేసి అక్కడకు పంపేశారు. ఏపీలో ఆమె కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉండి కడప నుంచి ఎంపీగా పోటీ చేశారు. షర్మిల ఎంపీగా ఓడిపోయినా కూడా ఆమె 1.40 లక్షల ఓట్లు సాధించి తన పట్టు అయితే చూపించారు. ఇక ఇప్పుడు షర్మిలను కర్నాటక కోటాలో రాజ్యసభకు పంపేందుకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. అదే జరిగితే షర్మిలకు మళ్లీ పదవి ద్వారా పొలిటికల్గా పట్టు దొరికినట్లవుతుంది.
సమస్య మీది.. పరిష్కారం మాది.. జాగృతం కండి తెలుగు ప్రజలారా...
సమస్యలు లేని వ్యక్తులే కాదు.. సమాజం కూడా లేదు. అయితే.. సమస్య వచ్చినప్పుడు.. దానిని ఎవరికి చెప్పాలి ? ఎవరిని కలవాలి ? ఎలా పరిష్కరించుకోవాలి ? అనేది కీలకం. అది అవినీతి అయినా.. లంచాలైనా.. రాజకీయ నాయకులు పెట్టే ఇబ్బందులు అయినా మీ సమస్యను మా సమస్యగా భుజాన వేసుకుంటాం. నేతలు పట్టించుకోవడం లేదని.. అధికారులు దురుసుగా వ్యవహరిస్తున్నారని చింతించాల్సిన అవసరమే లేదు. రండి.. చేయి చేయి కలుపుదాం.. మీ చింత తీర్చుదాం. మీ సమస్య ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.. పరిష్కార మార్గాన్ని పొందండి.