ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు... దేశంలోనే అత్యంత ప్రభావితమైన రాజకీయ నాయకుడు అన్న సంగతి తెలిసిందే. దాదాపు 40 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాలలో కీలక రాజకీయ నాయకులుగా కొనసాగుతున్నారు నారా చంద్రబాబు నాయుడు. ఆయన నేటికి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. అయితే తన రాజకీయ చరిత్రలో... ఎన్నో ఓటములు అలాగే గెలుపులు సాధించిన ఘనత చంద్రబాబు ఖాతాలో ఉంది.

ఎత్తులకు పైఎత్తులు వేయడంలో చంద్రబాబు నాయుడు ను మించిన వారు ఎవరూ లేరు. అయితే అలాంటి నారా చంద్రబాబు నాయుడును 2019 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుచిత్తు చేశారు వైయస్ జగన్మోహన్ రెడ్డి. మార్పు పేరుతో ఏపీ రాజకీయాలను కుదిపేసిన వైయస్ జగన్మోహన్ రెడ్డి.... టిడిపి పార్టీని భూస్థాపితం చేశారు. 2019 నుంచి 2024 వరకు టిడిపి పార్టీ నేతలకు చుక్కలు చూపించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.


 చంద్రబాబు నాయుడు కూడా అసెంబ్లీలో కంటతడి పెట్టుకునే పరిస్థితి నెలకొంది. అసలు మళ్లీ ఎన్నికలు వస్తే టిడిపి పార్టీ గెలుస్తుందా అనే... ఆందోళన కూడా జనాల్లో వచ్చింది. అలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు జైలు నుంచే చక్రం తిప్పారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడును అరెస్టు చేసినప్పటికీ.. ఆయన జైలు నుంచి చక్రం తిప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ అలాగే భారతీయ జనతా పార్టీలతో చేతులు కలిపి... కింగ్ మేకర్ అయ్యారు చంద్రబాబు నాయుడు.

 ఏకంగా నాలుగోసారి ముఖ్యమంత్రి అయి... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.  అలాగే మోడీ ప్రభుత్వాన్ని... ఉంచాలా లేదా దించాలా? అనేది ఓ తెలుగు వాడి చేతిలో పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దక్కింది. ఒక్కసారి కనుసైగా చేస్తే మోడీ ప్రభుత్వమే కుప్పకూలే ప్రమాదం కూడా ఉంటుంది. అలా జీరో నుంచి హీరో అయిపోయారు సీఎం చంద్రబాబు నాయుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: