
ఇక నాని రెండోసారి ఎంపీగా గెలిచాక తెలుగుదేశం పార్టీ అధిష్టానంతో ... మరీ ముఖ్యంగా లోకేష్ తో ఆయనకు బాగా గ్యాప్ పెరిగిపోయింది. ఈ క్రమంలోనే గత ఎన్నికలకు ముందు నానికి పోటీగా నాని సోదరుడు కేశినేని చిన్ని రంగంలోకి దిగారు. కేశినేని చిన్నికి తెలుగుదేశం విజయవాడ ఎంపీ సీటు ఇవ్వడంతో నాని ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి వైసిపి కండువా కప్పుకుని వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికలలో ఓటమి మీద తర్వాత వైసీపీకి గుడ్ బై చెప్పిన నాని తాను క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. అక్కడి వరకు బాగానే ఉంది. కొద్ది రోజుల నుంచి నాని తిరిగి రాజకీయాల్లోకి వస్తారని ఆయనను మరోసారి పార్టీలోకి తీసుకునేందుకు వైసిపి ప్రయత్నాలు చేస్తుందని ఒకవైపు ... అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపితో సన్నిహిత సంబంధాలు నేపథ్యంలో ఆయన బిజెపిలోకి వెళతారని మరోవైపు ప్రచారం జరుగుతుంది.
అలాగే ఒకవేళ నాని టిడిపిలోకి వచ్చినా తనకు అభ్యంతరం లేదని సోదరుడు చిన్ని చెప్పారని .. అయితే అందుకు ఆయన కొన్ని కండిషన్లు పెట్టారంటూ మరో ప్రచారం కూడా నడుస్తోంది. ఏది ఏమైనా గత వారం రోజులుగా కేశినేని నాని పొలిటికల్ రీఎంట్రీ పై ఒక్కటే వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ వాట్సాప్ నెంబర్‌తో సమస్య మీది.. పరిష్కారం మాది..
అవినీతి అయినా.. లంచాలైనా.. రాజకీయ నాయకులు పెట్టే ఇబ్బందులు అయినా మీ సమస్యను మా సమస్యగా భుజాన వేసుకుంటాం. నేతలు పట్టించుకోవడం లేదని.. అధికారులు దురుసుగా వ్యవహరిస్తున్నారని చింతించాల్సిన అవసరమే లేదు. రండి.. చేయి చేయి కలుపుదాం.. మీ చింత తీర్చుదాం. మీ సమస్య ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.. పరిష్కార మార్గాన్ని పొందండి.