ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు అంటు మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తెలియజేశారు. నిన్నటి రోజున విశాఖ మేయర్ అవిశ్వాస తీర్మానాన్ని సైతం ఉద్దేశిస్తూ ఇలా ట్వీట్ చేశారని తెలుస్తోంది. ప్రజలు ఇచ్చిన తీర్పును అపహాస్యం చేస్తున్నారని బెదిరింపులకు దిగి మరి విశాఖపట్నం మేయర్ గా ఉన్న ఒక బీసీ మహిళను పదవి నుంచి దించేయాలని కక్షపూరితంగానే టిడిపి పార్టీ వ్యవహరించిందని దుర్మార్గపు రాజకీయాలకు ఇది ప్రత్యక్ష సాక్ష్యం అంటూ తెలిపారు. 98 డివిజన్లో ప్రజలకు ఇచ్చిన తీర్పు ప్రకారం 58 స్థానాలలో వైసీపీ ఉండగా 30 స్థానాలలో టిడిపి గెలిచింది.


మరి టిడిపి మేయర్ పదవి ఏ విధంగా వస్తుంది అంటు జగన్ ప్రశ్నించడం జరిగింది. బీసీలలోని యాదవ కులానికి చెందిన మహిళ మేయర్ పదవిలో కూర్చోబెట్టకూడదనే ఇలా చేశారని ఆరోపించారు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఉండడమే కాకుండా తమ పార్టీ నేతలు భోజనం చేస్తున్న హోటల్ పైన పోలీసులతో మీ పార్టీ నాయకులు దాడి చేయించడం ఏంటా అంటూ జగన్ ఫైర్ అయ్యారు. అందుకు సంబంధించి సీసీ కెమెరా వీడియోలు ప్రజల ముందే ఉన్నాయని ఇది ప్రజాస్వామ్యం అంటా ప్రశ్నించారు.


మరొక ఏడాది గడిస్తే కౌన్సిలర్ పదవి కూడా పూర్తి అవుతుంది అప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తాయి చేసిన పనులు చెప్పి మరి ఓట్లు అడిగే ధైర్యం లేకనే ఇలా చేశారంటూ సీఎం చంద్రబాబును ఉద్దేశించి జగన్ ఇలా ప్రశ్నించడం జరిగింది. అన్ని సమాధానాలకు ఆ దేవుడే ప్రజల నుంచి గుణపాఠం చెప్పేలా చేస్తారంటూ జగన్ ట్విట్టర్ నుంచి తెలియజేశారు. నిన్నటి రోజున కూటమి ప్రభుత్వం విశాఖ మేయర్ పదవిని కైవసం చేసుకున్నది. అవిశ్వాస తీర్మానంలో తాము గెలిచామని కూటమినేతలు చెబుతూ ఉంటే ప్రతిపక్ష నేతలు మాత్రం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ బెదిరింపులకు దిగి మేయర్ పదవి తగ్గించుకున్నారు అంటూ మాట్లాడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: