అమెరికాలో ఉన్నామో , అమలాపురం లేదా అనకాపల్లిలో ఉన్నారో తెలియట్లేదు .. కానీ ఒక్కోసారి మన సినిమా  అభిమానులు అక్కడ చేసే హంగామా చూస్తే థియేటర్ల లో బీభత్సం కార్ల ర్యాలీ లు , నినాదాలు ఇలా ఒక్కటేంటి ? నానా బీభత్సం సృష్టిస్తున్నారు .. ఇక మన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు అక్కడ పెద్ద సంఖ్యలో వెళ్ళటం .. అక్కడ మనవాళ్లు పెద్ద సంఖ్య లో అమెరికాలో ఉద్యోగం చేయడం .. దీని కారణం గా టాలీవుడ్ భారీ సినిమాల కు బోలెడు డబ్బులు యుఎస్ మార్కెట్ నుంచి వచ్చి పడేవి ..


మంచి సినిమాలు , మాస్ సినిమాలకు మిలియన్లు కొద్ది వచ్చేవి .. అలానే ప్రతి స్టార్ హీరో సినిమా రిలీజ్ సమయం లో ఫ్యాన్స్ హంగామా ఊహించని రేంజ్ లో ఉండేది .. అయితే ఇప్పుడు అమెరికాలో అంతా మారిపోయింది .. ఇకపై యుఎస్ లో ఇలాంటి ర్యాలీలు , థియేటర్లు హంగామాలు కనిపించకపోవచ్చు .. మన వాళ్లు ఎలాంటి తప్పు చేస్తారా .. ఏ వంక దొరుకుతుందా , వీసా రద్దు చేద్దామా .. అని అక్కడి ప్రభుత్వం కాసుకుని కూర్చుంది .. ఏ మాత్రం రచ్చ జరిగిన చాలు మన విద్యార్థులు ఇండియాకు వచ్చేయటమే .. జై బాలయ్య , జై మెగాస్టార్ వంటి స్లోగాలను ఇక వినిపించడం తగ్గుతాయి ..  


అలాగే సినిమా ను ప్రశాంతంగా చూస్తారేమో .. థియేటర్ ద‌గ్గ‌ర‌ రచ్చ , కాగితాలు నింప‌డం కూడా ఆగిపోతుంది .. అయితే ఇప్పుడు ఇవన్నీ ఇలా ఉంటే అసలు కలెక్షన్లు కూడా ఇప్పుడు తగ్గేలా ఉంది .. ఉన్న పరిస్థితులు చూస్తుంటే అర్థమవుతుంది .. ఎందుకంటే ఇది వరకులా పార్ట్ టైం జాబులు గ‌ట్ర‌ పెద్దగా అక్కడ ఉండటం లేదు .. అక్కడున్నవారికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి  .. అందు వల్ల సినిమాలు కూడా సెలెక్టివ్ గా చూసే అవకాశం కూడా ఉంది .. గతంలో లాగా అన్ని మిలియన్లు ఇన్ని మిలియన్లు అనే రికార్డులు ఇక కనిపించడం కూడా కష్టమే ..

మరింత సమాచారం తెలుసుకోండి: