
ఏపీ కేంద్రమంత్రిగా బిజెపి కొత్త వ్యూహని రచించబోతున్నారు. కూటమిలోనే స్వయంగా ఎదగాలని భావిస్తోందట బిజెపి. ఇదే సమయంలో వరుసగా జరుగుతున్న పలు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను సైతం చాలా ప్రతిష్టాత్మకంగా బిజెపి తీసుకున్నది. దక్షిణాది రాష్ట్రాలలో బలం పెంచుకోవడమే కాకుండా సరికొత్త ప్రణాళికలు చేయడానికి సిద్ధమవుతోంది. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఆయన స్థానంలో తమిళనాడు నేత అన్నామలైకు అవకాశం లభించబోతోందనే విధంగా వార్త వినిపిస్తున్నాయి..
ఇదే సమయంలో పవన్ తో కూడా బిజెపి న్యాయకత్వం వహించేలా పలు రకాల కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. పవన్ కేంద్ర క్యాబినెట్ లోకి కూడా వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉందని ఢిల్లీ పాలిటిక్స్ లో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. బిజెపి నాయకత్వం జమిలి ఎన్నికలకు కసరత్తు చేస్తున్న సమయంలో ఇప్పటివరకు దక్కని రాష్ట్రాలలో బాగా వేయడానికి ప్లాన్ వేస్తోందట. అలా మోదీ క్యాబినెట్లో వచ్చే నెలలోనే విస్తరణ జరగబోతున్నట్లు సమాచారం. ఈ క్యాబినెట్లో ఆర్ఎస్ఎస్ నేపథ్యంలో పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న వారికి మొదటి ప్రాధాన్యత ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారట. ఆంధ్రప్రదేశ్ నుంచి టిడిపి-2, బిజెపి -1 కేంద్ర మంత్రులుగా కొనసాగుతున్నారని.. అందుకే జనసేన పార్టీకి ప్రాతినిధ్యం వెళ్లే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.