
అలాగే పాస్టర్ ప్రవీణ్ మృతి పైన అనుమానాలు చాలానే ఉన్నాయని జీవి హర్షకుమార్ ఇటీవలే కొన్ని మీడియా సంస్థలతో తెలియజేశారు. అంతేకాకుండా క్రైస్తవ సంఘాలకు పిలుపునిచ్చి గాయన్ బ్రిడ్జి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకునేలా చేశారు. అయితే హార్షకుమార్ అక్కడికి వెళ్లడంతో పోలీసులు మధ్య వాగ్వాదం నెలకొంది. దీంతో అక్కడి నుంచి హర్షకుమార్ పోలీసులు చాలా బలవంతంగా తీసుకువెళ్లారు. అంతేకాకుండా ఐదు గంటల వరకు పోలీసులు తనని ఇబ్బందులకు గురి చేశారంటూ ఆవేదనని తెలిపారు మాజీ ఎంపీ హర్ష కుమార్.
మాజీ ఎంపీ అయినప్పటికీ కూడా తనమీద పోలీసులు చాలా దారుణంగా వ్యవహరించారని ఏపీలో శాంతి భద్రతలే లేవంటూ తెలియజేశారు. ఏపీ అంతా బ్రిటిష్ పాలన కొనసాగుతోందని వెల్లడించారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి సమయంలో కొవ్వొత్తులతో తరలిరావాలని తాను ఎవరికి కూడా పిలుపు ఇవ్వలేదని కేవలం ఎవరి కుటుంబ సభ్యుల నుంచి వారు స్వచ్ఛందంగానే మృతి చెందిన చోటుకి కొవ్వొత్తులతో పట్టుకొని వచ్చారని.. కేవలం తాను వారి కోసమే ఒక టెంట్ మాదిరి వేయించానని తెలిపారు. ఎక్కడ కూడా బందుకు పిలుపునివ్వలేదని తెలిపారు.
డిఎస్పి ఎవరిని రానివ్వనది ఏమి చేయనివ్వనంటూ చెప్పారట. కారులో పశువు కంటే దారుణంగా తనని లాగేందుకు ప్రయత్నించారు అంటూ తెలియజేస్తున్నారు. ఇవే కాకుండా ఎన్నో రకాల విషయాలను చూపుతూ ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఏందయ్యా చంద్రబాబు నీ పాలనను ప్రశ్నిస్తే ఇష్టానుసారంగా మమ్మల్ని ఇలా చేస్తావా అంటూ ప్రశ్నించారు.