వైసిపి పార్టీ మాజీ నాయకులు విజయసాయిరెడ్డి.. ప్రస్తుతం రిటర్మెంట్ తీసుకొని లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. రాజకీయాలకు దూరంగా ఉండటమే కాకుండా... వైసిపి పార్టీతో పాటు రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు విజయసాయిరెడ్డి. అయితే రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన విజయసాయిరెడ్డి... వార్తల్లో మాత్రం నిత్యం నిలుస్తున్నారు. తనకు అన్నం పెట్టి పోషించిన వైసీపీ పార్టీ ని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విజయసాయిరెడ్డి తిరుగుబాటు బావుట ఎగురవేస్తున్నారు.

 ఇప్పటికే వైసీపీ పార్టీ అలాగే వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విజయ్ సాయి రెడ్డి.. తాజాగా మరోసారి బాంబు పేల్చారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి చుట్టూ కోటరీ వ్యవస్థ ఉందని... దానివల్లే వైసీపీ పార్టీకి దూరమైనట్లు చెప్పుకొచ్చారు. వైసిపి పార్టీలో గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవని... జగన్మోహన్ రెడ్డి ఇతరుల మాటలు వింటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 సాక్షి మీడియా సంస్థను ముందు ఉండి తాను నడిపించానని.. కానీ అందులోనే తనకు వ్యతిరేకంగా కథనాలు వస్తున్నాయని ఫైర్ అయ్యారు.   వైయస్ జగన్మోహన్ రెడ్డి మొదట్లో తనతో చాలా సఖ్యతగా ఉండేవారని.. కొంతమంది చెప్పిన మాటలను విని తనపై.. కక్ష సాధింపుగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు విజయసాయిరెడ్డి. ఆయన సతీమణి వైయస్ భారతి కూడా అలాగే వ్యవహరించారని మండిపడ్డారు.

 అందుకే ఆ పార్టీలో ఉండలేకపోయానని వెల్లడించారు. వేరే పార్టీలోకి వెళ్లక.. పూర్తిగా రాజకీయాలనుంచి నిష్క్రమించినట్లు స్పష్టం చేశారు విజయసాయిరెడ్డి. అయితే వైసిపి పార్టీ కోసం తాను చేసిన సేవలను.. జగన్మోహన్ రెడ్డి మర్చిపోయాడని... ఆవేదన వ్యక్తం చేస్తూ విజయసాయిరెడ్డి బయటికి వచ్చారు. ఆయన బయటికి రాకముందే జగన్ మోహన్ రెడ్డి ఒక మెట్టు దిగివస్తే పరిస్థితి వేరే లాగా ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి డిసైడ్ అయిపోయారు. పార్టీ నుంచి విజయసాయిరెడ్డి పోయేలా చేశారు. అందుకే విజయసాయిరెడ్డి తిరుగుబాటు చేయాల్సి వచ్చిందని విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: