వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ప్రస్తుతం రాజకీయంగా యాక్టివ్‌గా లేరు. ఆయ‌న ఖాళీగానే ఉంటున్నారు. త‌న అవంతి విద్యాసంస్త‌లు చూసుకుంటూ ఇంటికే ప‌రిమిత‌మ‌వుతున్నారు. అయినా ఆయ‌న వైసీపీకి రాజీనామా చేసి నెల‌లు గ‌డుస్తున్నా ఆయ‌న తిరిగి రాజ‌కీయంగా యాక్టివ్ అవ్వాల‌ని ట్రై చేస్తున్నా ఆయ‌న‌ను పార్టీలో చేర్చుకునేందుకు ఎవ్వ‌రూ ఇష్ట‌ప‌డ‌డం లేద‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే అవంతి త‌న ట్ర‌య‌ల్స్ మాత్రం ఆప‌డం లేద‌ట‌. చివ‌ర‌కు వైసీపీ కార్పొరేట‌ర్‌గా ఉన్న త‌న కుమార్తెతో కూడా తాజాగా మేయ‌ర్ హ‌రికుమారిపై అవిశ్వాస తీర్మానం సంద‌ర్భంగా రాజీనామా చేయించారు. అయితే అవంతిని త‌మ పార్టీలో చేర్చుకునే విష‌యంలో ఎవ్వ‌రూ న‌మ్మ‌డం లేద‌ని తెలుస్తోంది.


అవంతి త‌మ పార్టీలోకి వ‌స్తే రాజ‌కీయంగా ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని లేదా ఆయ‌న త‌న అవ‌స‌రాల కోస‌మే ప్ర‌తిసారి పార్టీలు మారుతూ ఉంటార‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చేశారు. అందుకే ఆయ‌న‌ను పార్టీలోకి తీసుకునేందుకు ఎవ్వ‌రూ ఇష్ట‌ప‌డ‌డం లేదు. వైసీపీలో గౌర‌వం లేక బ‌య‌ట‌కు వ‌చ్చేశాన‌ని అవంతి అంటున్నారు. అస‌లు ఆయ‌న జీవితంలో తొలిసారి మంత్రి అయ్యింది వైసీపీ ప్ర‌భుత్వంలోనే అన్న‌ది మ‌ర్చిపోతే ఎలా ? మ‌రే పార్టీ కూడా ఆయ‌న‌కు అంత ప్ర‌యార్టీ ఇవ్వ‌లేదు. ప్ర‌జారాజ్యం, కాంగ్రెస్‌, టీడీపీ ఇలా ప‌లు పార్టీలు మారినా అవంతికి వైసీపీలోనే మంత్రిగా గుర్తింపు వ‌చ్చింది.


ఇక ఇప్పుడు ఆయ‌న జ‌న‌సేన వైపు చూస్తున్నార‌న్న ప్ర‌చారం ఉంది. అయితే విశాఖ‌లో ఇప్ప‌టికే జ‌న‌సేన‌, టీడీపీ నేత‌లు ఫుల్‌గా ఉన్నారు. అక్క‌డ బీజేపీ నాయ‌కులు కూడా ఎక్కువే ఉన్నారు. అందుకే ఆయ‌న‌ను జ‌న‌సేన లో చేర్చుకునేందుకు ఆ పార్టీ నేత‌లు ఏ మాత్రం ఆస‌క్తిగా లేర‌ట‌. అయితే క్యాస్ట్‌తో పాటు క్యాష్ పుష్క‌లంగా ఉన్న అవంతి వ‌చ్చే ఎన్నిక‌ల‌కు కాస్త ముందుగా పొలిటిక‌ల్‌గా యాక్టివ్ అయ్యి జ‌న‌సేన నుంచి పోటీ చేయాల‌న్న ప్లాన్‌తో అయితే ఉన్నార‌ట‌. మ‌రి అవంతి పొలిటిక‌ల్ రీ ఎంట్రీ విష‌యంలో ఏం జ‌రుగుతుందో ?  చూడాలి.


వాట్సాప్ నెంబ‌ర్‌తో స‌మ‌స్య మీది.. ప‌రిష్కారం మాది..

అవినీతి అయినా.. లంచాలైనా.. రాజ‌కీయ నాయ‌కులు పెట్టే ఇబ్బందులు అయినా మీ స‌మ‌స్య‌ను మా స‌మ‌స్య‌గా భుజాన వేసుకుంటాం. నేత‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. అధికారులు దురుసుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారని చింతించాల్సిన అవ‌సర‌మే లేదు. రండి.. చేయి చేయి క‌లుపుదాం.. మీ చింత తీర్చుదాం. మీ స‌మ‌స్య ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.. ప‌రిష్కార మార్గాన్ని పొందండి.

మరింత సమాచారం తెలుసుకోండి: