
తెలంగాణ రాష్ట్రంలో ఖైరతాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే దానం నాగేందర్ పరిస్థితి అత్యంత దారుణంగా తయారయింది. గులాబీ పార్టీ కండువా వేసుకొని ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్.... వెంటనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో... జంప్ అయ్యారు. గులాబీ పార్టీకి గుడ్.. చెప్పి... కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు దానం నాగేందర్. పదిమంది ఎమ్మెల్యేలలో మొట్టమొదటగా దానం నాగేందర్ ఒక్కడే... కాంగ్రెస్ కండువా కప్పుకొని రచ్చ రచ్చ చేశాడు.
అయితే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన తర్వాత సికింద్రాబాద్ ఎంపీగా కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ద్వారా గెలిచే ప్రయత్నం చేశాడు. కానీ ఆయన నియోజకవర్గంలోనే దానం నాగేందర్ కు మెజారిటీ ఓట్లు పడలేదని సమాచారం. అలాగే.. గులాబీ పార్టీ క్యాడర్ కూడా దానం నాగేందర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోందట. ఎంతో కష్టపడి దానం నాగేందర్ ను గెలిపిస్తే... ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి జాయిన్ అయ్యాడని.. గులాబీ పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అలాగే...... ఖైరతాబాద్ నియోజకవర్గంలో... పిజిఆర్ కొడుకు విష్ణు గులాబీ పార్టీలో ఉండి దుమ్ము లేపుతున్నాడు. అలాగే.. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పిజెఆర్ కూతురు... ఖైరతాబాద్ నియోజకవర్గ నుంచే పోటీ చేసి ఓడిపోయింది. దీంతో పిజెఆర్ కూతురు వర్సెస్ దానం నాగేందర్ అన్నట్లుగా ఖైరతాబాద్ నియోజకవర్గంలో గొడవలు జరుగుతున్నాయి. వినాయక చవితి సందర్భంగా కూడా.. ఈ ఇద్దరు మధ్య ఫ్లెక్సీలో వార్ కొనసాగింది.
ఇక ఇప్పుడు.. ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఈ క్షణమైన ఉప ఎన్నిక వస్తుందని అందరూ అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ తీసుకొని ఎంపీగా పోటీ చేసిన దానం నాగేందర్ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. మిగిలిన 9 నియోజకవర్గాల్లో... బై ఎలక్షన్స్ వచ్చినా రాకపోయినా... కచ్చితంగా ఖైరతాబాద్ కు వస్తుందని అంటున్నారు. అయితే ఖైరతాబాద్ టికెట్ మాత్రం... దానం నాగేందర్ కు కాంగ్రెస్ ఇచ్చే పరిస్థితి లేదని కూడా తెలుస్తోంది. దీంతో దానం నాగేందర్ దారేటు అని అందరూ చర్చించుకుంటున్నారు. గులాబీ పార్టీ మళ్లీ అతన్ని జాయిన్ చేసుకునే పరిస్థితి కూడా లేదు.