
మే రెండవ తేదీన అమరావతిలో జరిగే ఈ టూర్ కు 5 లక్షల మంది వస్తారని నేతలు అంచనా వేస్తున్నారు. అయితే ఎక్కడ కూడా లోటుపాట్లు కనిపించకుండా చూసేందుకు అన్ని రకాల ఏర్పాట్లను కూడా చేసేందుకు మంత్రివర్గాలు ఈ రోజున సమావేశమయ్యారు. ఇందులో మంత్రులు పయ్యావుల కేశవ్, నారాయణ ,నాదెండ్ల మనోహర్ ,నోడల్ అధికారి వీర పాండ్యన్ ప్రధాన టూర్ గురించి ఏర్పాట్లకు సంబంధించి చర్చించారు. ఈ భేటీ తర్వాత మంత్రి నారాయణ తెలియజేస్తూ ప్రధాన పర్యటనను విజయవంతం చేసేందుకే అధికారులు మంత్రులు చర్యలు చేపడుతున్నారని తెలిపారు.
మే రెండవ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాన మోడీ అమరావతికి వస్తారని సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల లోపే ఒక బహిరంగ సభ ఉంటుంది.. ఆ తర్వాత అమరావతి పునర్నిర్మాణ పనులు కూడా మొదలవుతాయని తెలియజేశారు. వచ్చిన వారందరికీ కూడా నీరు సరఫరా పార్కింగ్ ఇతరత్ర వసతులను కూడా కల్పించబోతున్నట్లు తెలియజేశారు. ప్రతి ఒక్కరు కూడా సమన్వయం చేసుకొని ప్రధాన మోడీ పర్యటన విజయవంతం చేయాలని తెలిపారు. అయితే గతంలో లాగే ప్రతిపక్షాలకు కూడా ఇప్పుడు ఆహ్వానం పంపించారని గతంలో ప్రధాన మోడీ అమరావతి శంకుస్థాపన చేసినప్పుడు కూడా టిడిపి ప్రభుత్వం ఆహ్వానించిన వైసీపీ అధినేత జగన్ హాజరు కాలేదు..మరి ఈసారి వెళ్తారా లేదో చూడాలి.