
నిరుద్యోగ భృతి కి సంబంధించి గ్రాడ్యుయేషన్, పీజీ చదివినా కూడా నిరుద్యోగులుగా చాలామంది ఉన్నారు. మరి కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తూ చదువుతూ ఉన్నారు. అదేవిధంగా బ్రాహ్మణులు తమ మతపరమైన విద్యను కూడా బోధించి ఖాళీగా ఉన్నారట. దైవ కార్యక్రమలకు సంబంధించి ఆగమ శాస్త్రం చదివిన వారందరికీ కూడా ఈ పథకాన్ని ఇచ్చేలా ఏపీ సీఎం చంద్రబాబు ప్లాన్ చేశారట. ఇందుకు సంబంధించి విధివిధానాలను కూడా రిలీజ్ చేశారు ఏపీ ప్రభుత్వం.
దీంతో రాష్ట్రంలో ఆగమ శాస్త్రం చదివి ధ్రువీకరణ పత్రం పొందిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని వీరికి 3000 రూపాయలు అందిస్తుంది ప్రభుత్వం అంటూ తెలుపుతున్నారు. అయితే ఇందులో లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా యువ పండితులు 599 మంది మాత్రమే ఉన్నారట. ఎవరైనా ఈ లిస్టులో కనుక తమ పేరు లేకపోతే కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు ఏపీ ప్రభుత్వం కూడా అవకాశం కల్పిస్తోంది. ఇక జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలకు సంబంధించి డబ్బులను కూడా విడుదల చేశారు.