ఆంధ్రప్రదేశ్లోని స్కూలు విద్యార్థులు సైతం ఎప్పుడెప్పుడా అని సమ్మర్ హాలిడేస్ కోసం చాలా ఎదురు చూస్తున్నారు. వీరికి తాజాగా ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలియజేసింది. ఈసారి ఏకంగా 48 రోజులపాటు సమ్మర్ హాలిడేస్ ఉండబోతున్నాయి అంటూ ప్రకటించారు. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవులు ఉండబోతున్నాయి. ఈమెరకు అధికారికంగా విద్యాశాఖ ప్రకటన కూడా విడుదల చేసింది. పాఠశాలలు జూన్ 12వ తేదీన ప్రారంభమవుతాయని అన్ని స్కూళ్లకు కూడా బుధవారం నుంచి సెలవులు ప్రకటించి ఈ ఏడాది చివరి పని దినంగా ప్రకటించారు.


ఇక డిప్యూటేషన్ మీద పనిచేస్తున్న ఉపాధ్యాయులు సైతం ఇవాళ రేపు పాత స్కూళ్లలోనే ఉండాలంటూ విద్యాశాఖ కూడా ఆదేశాలను జారీ చేసింది. తెలంగాణలో ఎల్లుండి నుంచి సెలవులు ప్రారంభించే విధంగా ప్లాన్ చేశారు. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు గురుకుల పాఠశాలలు కూడా సెలవులు ప్రకటించాయి. ప్రస్తుతం అయితే ఎండలు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ వంటి పూట బడులు కొనసాగాయి.



ఇక సమ్మర్ హాలిడేస్ లో ఎవరూ కూడా పిల్లలకు సంబంధించి తరగతులు నిర్వహించరాదు అంటూ ప్రభుత్వాలు సైతం ఇప్పటికే ప్రైవేటు స్కూలు యాజమాన్యులను హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ వేసవి సెలవులు వారికి ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించేలా పలు రకాల కార్యక్రమాలలో పాల్గొనడానికి కుటుంబంతో సమయాన్ని గడపడానికి అవకాశం కల్పిస్తున్నారని తెలియజేస్తున్నారు.ఇక సమ్మర్ హాలిడేస్ లో పాఠశాలలో పిల్లలు సమయాన్ని సైతం సరదాగా గడపాలని.. తెలివితేటలను పెంచడంలో తల్లిదండ్రులు కూడా సహాయం చేయాలని పలువురు ఉపాధ్యాయులు కూడా తెలియజేస్తున్నారు.మొత్తానికి ఈసారి సమ్మర్ హాలిడేస్ 48 రోజులను తెలిసి విద్యార్థులు కూడా తెగ సంబరపడుతున్నారు. రేపటి రోజున పదవ తరగతి ఫలితాలు విడుదల కాబోతున్నాయి. అటు ఏపీ విద్యార్థులు కూడా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: