ఈ రోజుల్లో విద్యార్థులకు, ఉపాధ్యాయులు అంటే భయం లేకుండా ఉన్నది. సాధారణంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు అంటే జోకులు వేసుకుంటూ సరదాగా ఉంటారు..కొంతమంది ఉపాధ్యాయుల ప్రవర్తన మరొకరకంగా ఉండగా విద్యార్థుల ప్రవర్తన చూస్తూ ఉంటే మరి కొంతమంది ఆశ్చర్యపోయేలా ఉన్నారు. అసలు ఏం చదువులు ఇవి? అనే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని ఒక ఇంజనీరింగ్ కళాశాలలో ఏకంగా విద్యార్థి లెక్చరర్ని చెప్పుతో దాడి చేసిన ఘటన ఒక్కసారిగా కలకలాన్ని సృష్టిస్తున్నది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.



అసలు విషయంలోకి వెళ్తే ఒక ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో చదువుకుంటున్న ఒక విద్యార్థి మొబైల్ టీచర్ తీసుకుందని ఆ విద్యార్థి ఏకంగా చెప్పుతోనే కొట్టింది. ఈ దృశ్యాలు వైరల్ గా మారడంతో ఈ సంఘటన చూసిన వారందరూ కూడా బాధపడుతూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇది విశాఖ, విజయనగరం మద్య ఉన్న ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో చోటు చేసుకున్న సంఘటన అన్నట్లుగా తెలుస్తోంది. ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం చదువుతున్న ఒక యువతి కాలేజ్ ఆవరణంలోనే సెల్ఫోన్ మాట్లాడుతూ టీచర్ కంటపడడంతో ఆ వెంటనే టీచర్ ఆ విద్యార్థి యొక్క సెల్ ఫోన్ ని అదుపులోకి తీసుకున్నారు.


దీంతో ఆ విద్యార్థికి కోపం రావడంతో చదువు చెప్పిన టీచర్ అని కూడా చూడకుండా కోపంతో ఆ గౌరవప్రదమైన మాటలతో మాట్లాడుతూ తిడుతూ ఉండడమే కాకుండా తన కాళ్ళకు వేసిన చెప్పు తీసి మరి ఆ చెప్పుతో చెల్లుమనిపించింది విద్యార్థి. దీంతో అక్కడ ఉన్న విద్యార్థుల సైతం టీచర్ ని విద్యార్థిని విడిపించే ప్రయత్నం చేసిన కూడా ఆ విద్యార్థి అసలు వెనక్కి తగ్గలేదు. ఇదంతా చూసిన వారందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు.. ఈ వీడియో చూసిన నెటజన్స్ సైతం ఇది విష సంస్కృతికి దారితీస్తుంది అసలు ఉపాధ్యాయురాలని అలాంటి మాటలు అనవచ్చా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: