
కానీ ఈ మనమిత్ర యాప్ ప్రజలకు చేరువ కాలేకపోతోందట. గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటికీ 70% మంది ప్రజలు ఆండ్రాయిడ్ మొబైల్స్ వాడుతూ ఉన్న ఇప్పటికీ వినియోగించుకోలేదట. ఇక నగర ప్రాంతాలలో మనమిత్ర యాప్స్ పైన అవగాహన లేకపోవడం వల్ల కేవలం 20 శాతానికి మించి ఉండడం లేదట. ఇటీవలే ఇంటర్ ఫలితాలు వాట్సాప్ సేవలు ద్వారా విడుదల చేసిన 40 శాతం మంది విద్యార్థులు కూడా ఈ మనమిత్ర సేవలను ఉపయోగించుకోలేదని నివేదికలు ఏపీ ప్రభుత్వానికి వెళ్లిందట.
గ్రామీణ ప్రాంతాలలో అయితే చాలా ఘోరంగా ఉందని ఎలాంటి అవసరాలైనా సరే సచివాలయాల సిబ్బందికి వెళ్లి మరి తెచ్చుకుంటున్నారని నివేదిక అందిందట.. ఈ వాట్సాప్ సేవలు చప్పడానికే బాగున్న.. ఇందులో అడిగే పత్రాల కోసం తిరిగి మళ్ళీ సచివాలయానికి వెళ్లాల్సి ఉంటుందట.. అందుకే అన్ని ఒకేచోటే పూర్తి చేసుకోవచ్చని సచివాలయానికి వెళ్లి మరి ప్రజలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఇన్కమ్, క్యాస్ట్, సర్టిఫికెట్లతోపాటు ఇతరత్రా సేవలు అన్నీ కూడా అక్కడే పొందుతున్నారు. ఇక సీఎం చంద్రబాబు కూడా మనమిత్ర యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని చెబుతూ ఉన్న వీటి గురించి ఎవరు పెద్దగా పట్టించుకోలేదని చెబుతున్నారు.. అయితే నేతలు మాత్రం ఈ యాప్ ని ఇంకా సంస్కరించాలని తెలియజేస్తున్నారు.