తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు అడుగడుగున ఆటంకాలు ఎదురవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత... కెసిఆర్ పార్టీకి... ఎక్కడ చూసినా షాకులే తగులుతున్నాయి. ఎన్నికల్లో... ఓడిపోయిన తర్వాత ఏకంగా 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు. ఆ తర్వాత ఎమ్మెల్సీలు కూడా వెళ్ళిపోతున్నారు. అయినప్పటికీ కేటీఆర్ అలాగే హరీష్ రావు ఇద్దరు కలిసి పార్టీని ముందుండి నడిపించారు.

 రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీగా గులాబీ పార్టీ దీటుగా ముందుకు వెళుతుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి కూడా చేస్తోంది. ప్రతిపక్ష పార్టీగా తెలంగాణలో సమర్థవంతమైన పాత్రను పోషిస్తున్న గులాబీ పార్టీ... త్వరలోనే భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ ఉద్యమ పార్టీగా వచ్చిన గులాబీ పార్టీ... ఇప్పుడు భారత రాష్ట్ర సమితిగా మారింది. అయితే ఈ పార్టీ ఏర్పాటై.. 25 సంవత్సరాలు పూర్తయింది.

 ఇలాంటి నేపథ్యంలో... రజతోత్సవ సభ పేరుతో... వరంగల్ జిల్లా ఎలకతుర్ధిలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. అలాగే ఏడాదిన్నర  కాలంగా... కెసిఆర్ కూడా అసలు బయటకు రాలేదు. కేవలం కేటీఆర్ అలాగే హరీష్ రావు ఇద్దరు పార్టీని నడిపించారు. అయితే.. కెసిఆర్ మాత్రం నేరుగా పోరాటంలోకి దిగలేదు. ఇప్పుడు కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారు. దీని కోసమే 27వ తేదీన భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకోబోతున్నారు కేసీఆర్.

 అయితే ఈ సభకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక రకాల అడ్డంకులను సృష్టిస్తుందని సమాచారం. మొదట ఈ సభకు పర్మిషన్ ఇవ్వలేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఓటుకు వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఇప్పుడు కాలేశ్వరం ప్రాజెక్టు  విషయంలో అవినీతి జరిగిందని కేసీఆర్ అలాగే హరీష్ రావులను విచారణకు పిలిపించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట. ఇన్ని రోజులు సైలెంట్ గా ఉండి ఇప్పుడు... విచారణకు పిలువనుందట. అది కూడా సభ అంటే ముందు రోజు కేసీఆర్ అలాగే హరీష్ రావును విచారణకు పిలువబోతున్నారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: