
దువ్వాడ శ్రీనివాసులు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ వైసిపి పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది వైసిపి పార్టీ. నిన్నటి... రోజున వైసీపీ పార్టీ కీలక నేతలతో జగన్మోహన్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా... ఏపీ రాజకీయాలలో... ఎలా ముందుకు వెళ్లాలి...? పార్టీని ఎలా కాపాడుకోవాలి అనే దాని పైన చర్చ నిర్వహించారట జగన్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా నాయకులు అందరి సలహాలు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి.
వైసీపీ పార్టీలో కొత్తగా పదవులు పొందిన వారికి దిశా నిర్దేశం కూడా చేశారట. పార్టీని ముందుకు తీసుకువెళ్లాలని వారిని కూడా కోరాడట జగన్మోహన్ రెడ్డి. పార్టీ కార్యకర్తలకు ఎలాంటి కష్టం రాకుండా చూస్తానని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టినా కూడా పార్టీ తరఫున లాయర్లు వాదిస్తారని కూడా వెల్లడించారు. ఎలాగైనా వైసీపీ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కూడా.. స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి.
అధికారంలోకి వచ్చిన తర్వాత కష్టపడ్డ వారికి.. తగిన ప్రతిఫలం దక్కుతుందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే గుడివాడ అమర్నాథ్కు అనకాపల్లి జిల్లాను అప్పగించారు. ఇటు దువ్వాడ శ్రీనివాస్ పై వేటు వేశారు జగన్మోహన్ రెడ్డి. గత కొన్ని రోజులుగా... మాధురి అలాగే దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పార్టీ పరువు పోతుందని. దువ్వాడ శ్రీనివాస్ పై వేటు వేసినట్టు తెలుస్తోంది.