నిన్నటి రోజున జమ్మూ కాశ్మీర్లో పహాల్గాంలో జరిగిన ఉగ్రవాది దాడులను చాలామంది మరణించారు. అయితే ఇందులో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాసులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా విశాఖపట్టణం వాసి విశ్రాంతి బ్యాంకు ఉద్యోగి చంద్రమౌళి కూడా మృతి చెందినట్లుగా తెలుస్తోంది. అయితే పారిపోతున్న ఆయనను వెంటాడి మరి చంపినట్లుగా అక్కడ కొంతమంది ఉండే స్థానికులు తెలియజేస్తున్నారు. అయితే చంపొద్దు అంటూ వేడుకున్న ఉగ్రవాదులు సైతం ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలియజేశారు. అయితే చంద్రమౌళి మృతదేహం అన్నట్లుగా సహచర టూరిస్టులు సైతం గుర్తించారు. ఈ విషయం తెలిసిన వెంటనే చంద్రమౌళి కుటుంబ సభ్యులు పహల్గాకు బయలుదేరారు.


కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాది దారిలో మరొక తెలుగువాసి మరణించారు. హైదరాబాద్ కు చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఇంటిలిజెన్స్ బ్యూరోలో ( ఎస్ఐబి ) కార్యాలయంలో సెక్షన్ అధికారిక పనిచేస్తున్న మనీష్ రంజన్ కుటుంబ సభ్యులతో పాటుగా కాశ్మీర్ పర్యటనలకు వెళ్లారట. అయితే తన భార్య ఇద్దరు పిల్లలు ముందే ఈ ఉద్యోగిని ఆ ఉగ్రవాదులు కాల్చి చంపారని కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు. కానీ కుటుంబ సభ్యులను వదిలిపెట్టి ఆయన ఐడి కార్డు చూసి మరి కాల్చారని తెలియజేస్తున్నారు. బీహార్ ప్రాంతానికి చెందిన మనీష్ ఉద్యోగిరీత్యా హైదరాబాదులోనే ఉంటున్నారట.


అలాగే నెల్లూరు ప్రాంతానికి చెందిన మధుసూదన్ అనే వ్యక్తి కూడా ఈ తూటాలకు బలయ్యారు.బెంగళూరులో స్థిరపడిన మధుసూదన్ ఫ్యామిలీతో కలిసి ఇటీవలే జమ్మూ కాశ్మీర్ విహారయాత్రకు వెళ్లారు. అయితే ఈ సంఘటనలు అటు రెండు తెలుగు రాష్ట్ర ప్రజలను కూడా బయబ్రాంతులకు గురయ్యేలా చేస్తున్నాయి. అయితే ఈ సంఘటన తెలిసిన క్షణమే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హుటాహుటిగా అక్కడి ప్రాంతానికి నిన్నటి రోజున రాత్రి బయలుదేరి వెళ్లారూ.. మరి ఇలాంటి సంఘటనలకు దీటుగా ఎలాంటి ప్రతి చర్య చేస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: