
జమ్మూ కాశ్మీర్, పహల్గామ్‌లో మంగళవారం ఉగ్రవాదులు టూరిస్టులను టార్గెట్ చేస్తూ దారుణానికి ఒడిగట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఏఈ ఘటనతో యావత్ దేశం దిగ్భ్రాంతి గురి అయింది. ఈ దాడిలో ఇప్పటి వరకు 30 మంది మరణించగా... మరికొంతమంది గాయపడినట్లు తెలుస్తోంది. అయితే, మరణాల సంఖ్య మరింత పెరగొచ్చనే అనుమానాలు వస్తున్నాయి. ఈ ఉగ్ర దాడిని ప్రధాని నరేంద్ర మోడీ సహా అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ చాలా తీవ్రస్థాయిలో ఖండించారు. దాడికి పాల్పడినవారిని ఉపేక్షించేది లేదని, ఖచ్చితంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు.
అయితే, పక్కా ప్లాన్ ప్రకారమే ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్టు నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఆర్మీ దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు టూరిస్టులను ఏమార్చి మరీ కాల్పులు జరిపారు. అదే సమయంలో పేరు, మతం అడుగుతూ, ఐడెంటిటీ కార్డులు కూడా చెక్ చేస్తూ మారణహోమం సృష్టించారు. కాగా ఈ దాడికి సంబంధించిన భయంకరమైన నిజాలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. కర్ణాటకలోని శివమొగ్గకు చెందిన ఒక వ్యక్తిని కాల్చి చంపిన తర్వాత, అతని భార్య.. తనని కూడా చంపేయమని వేసుకోవడంతో, టెర్రరిస్టులు అతడి భార్యతో మాట్లాడుతూ.. ‘‘నిన్ను మేము చంపము. వెళ్లి మోడీకి ఈ విషయం చెప్పు. ఏం చేసుకుంటారో చేసుకోండి!’’ అని అన్నాడట. సదరు రాక్షసుడు ప్రధాని మోడీని ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేయడంతో ఈ విషయం హాట్ టాపిక్ అవుతోంది.
ఇకపోతే... శివమొగ్గకు చెందిన కుటుంబం సెలవుల్లో కాశ్మీర్ విహారయాత్రకు వెళ్లింది. మంజునాథ్ అతడి భార్య పల్లి, కొడుకుతో కాశ్మీర్ లోయకు వెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలో దాడికి సంబంధించిన విషయాలను పల్లవి వివరించారు. “మేము మొత్తం ముగ్గురం ఇక్కడికి వచ్చాము. నేను, నా భర్త మరియు మా కొడుకు కాశ్మీర్‌కు వచ్చాము. మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో జరిగినట్టు గుర్తు. మేము పహల్గామ్‌లో ఉన్నాము. ఆ దుర్మార్గులు అకస్మాత్తుగా కాల్పులు జరపడంతో, అతను నా కళ్ళ ముందు అక్కడికక్కడే మరణించాడు. వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టొద్దు!” అని కన్నీటి పర్యంతమైంది. ఇది ఇప్పటికీ చెడు కలలా ఉందని, దాడి జరిగిన వెంటను స్థానికులు తమకు సాయం చేయడానికి వచ్చారని పల్లవి ఈ సందర్భంగా చెప్పింది.