జమ్ముకశ్మీర్‌ పహల్గామ్ ఉగ్రవాద దాడి చాలా హేయనీయమైన చర్య. దీనిని దేశవ్యాప్తంగా కుల మతాలకు అతీతంగా ఖండిస్తున్నారు. దక్షిణ కాశ్మీర్‌లోని ప్రధాన పర్యాటక ప్రదేశం అయినటువంటి పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేయడంతో ఇప్పటి వరకు 30 మంది మరణించారు. మరికొంతమంది గాయపాలు పలు కావడంతో చికిత్స పొందుతున్నారు. ఈ దాడి తర్వాత భద్రతా సంస్థలు మరింత అప్రమత్తమయ్యాయి. ఈ దాడి చేసిన వారిని వదిలిపెట్టబోమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ సందర్భంగా అన్నారు.

ఈ నేపథ్యంలో మోడీ మాట్లాడుతూ... "పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. సొంతవారిని కోల్పోయిన వారికి నా ప్రగాఢ సంతాపం. గాయపడిన వారు వీలైనంత త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. బాధిత ప్రజలకు సాధ్యమైనంత సహాయం అందిస్తున్నాం. ఈ హేయమైన చర్య వెనుక ఉన్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే పెట్టే ప్రసక్తి లేదు. న్యాయం స్థానం ముందు వారిని తప్పక నిలబెడతాం. వారి దుర్మార్గపు అజెండా ఎప్పటికీ విజయవంతం కాదు. ఉగ్రవాదంపై పోరాడాలనే మా సంకల్పం చాలా దృఢమైంది. అది మరింత బలపడుతుంది!" అని ప్రధాని మోదీ అన్నారు. ఈ సంఘటన బైసరన్‌ లోయ ఎగువ ప్రాంతాల్లో జరిగింది. భద్రతా దళాలు ఆ ప్రాంతానికి చేరుకొని ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నాయి. తాజాగా వారిలోని ఓ ఇద్దరిని మట్టుబెట్టినట్టు సమాచారం.

ఈ నేపథ్యంలో జరిగిన ఉగ్రదాడిపై భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "పహల్గామ్ దాడి గురించి విని నేను షాక్ అయ్యాను. అమరులైన పర్యాటకులకు నా హృదయపూర్వక సంతాపం మరియు గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను!" అని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. "జమ్మూ కాశ్మీర్‌లో 3 దశాబ్దాల ఉగ్రవాద దాడుల్లో అత్యంత దారుణమైన ఉగ్రవాద దాడుల్లో ఇది ఒకటి. అమాయకులైన వారిపై దాడి చేయడం వారి చేతకానితనానికి నిదర్శనం! అమరులైన వారి ఆత్మ శాంతించాలి.." అని శిఖర్ ధావన్ సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చారు. ఇంకా మరింతమంది క్రికెటర్లు, సెలిబ్రిటీలు మరణించినవారి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: