ఆంధ్రప్రదేశ్లో పదవ తరగతి ఫలితాలను మంత్రి నారా లోకేష్ విడుదల చేయడం జరిగింది. ఈ ఏడాది జరిగిన పరీక్షలలో మొత్తం మీద 6,14,459 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా ఇందులో 4,98,585 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారట. మొత్తం మీద 81.14 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లుగా తెలియజేశారు. ఇందులో బాలులు 78.31 శాతం మధ్య కాగా బాలికలు 84.9 శాతం వరకు ఉత్తీర్ణత సాధించారట. అలాగే రాష్ట్రంలో ఉండేటువంటి 1,680 పాఠశాలలు వర్ధశాతం ఫలితాలను రాబట్టాయట.


19 పాఠశాలలో అసలు ఎవరూ కూడా పాస్ కాలేదని అందులో తొమ్మిది ప్రైవేటు విద్యాసంస్థలు ఉండగా పది ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని తెలియజేస్తున్నారు. 65 36 శాతం మంది విద్యార్థులు ఫస్ట్ క్లాసులో ఉత్తీర్ణత అయ్యారని..10.69 శాతం మంది విద్యార్థులు సెకండ్ క్లాసులో పాసయ్యారని థర్డ్ క్లాసులో 5.09 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని తెలియజేశారు. అయితే ఫలితాలు విడుదల చేసిన మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. ఫలితాలలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు.


అలాగే ఉత్తీర్ణత సాధించని విద్యార్థులు ఎవరూ కూడా నిరుత్సాహ పడవద్దు మే 19వ తేదీ నుంచి 28వ తేదీ వరకు పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని.. ఈనెల 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు సప్లమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవచ్చంటూ తెలియజేశారు. ఎవరైనా ఆలస్యం గా  అప్లై చేస్తే 50 రూపాయలు అదనపు ఫీజుతో మే 18 వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి దరఖాస్తు చేసుకునే సదుపాయం కల్పిస్తున్నామంటూ మంత్రి నారా లోకేష్ తెలియజేశారు. అటు సప్లమెంటరీ పరీక్షలు అయిపోయిన వెంటనే ఫలితాలను తొందరగానే విడుదల చేస్తామంటూ మంత్రి నారా లోకేష్ తెలియజేశారు. మరి విద్యార్థులు ఎవరైనా ఫెయిల్ అయి ఉంటే వారు రేపటి నుంచి పరీక్ష ఫీజుని  చెల్లించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: