టిడిపి మాజీ నేత ఎంపీపీ వీరయ్య చౌదరి హత్య కేసు ఏపీ అంతట కూడా హాట్ టాపిక్ గా మారుతోంది. అయితే ఈ టిడిపి నేత హత్య కేసు వెనక రాజకీయ కోణం ఉన్నట్లుగా తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి.. వీరయ్య చౌదరి హత్య వెనుక నాగులుప్పలపాడు కి చెందిన వైసిపి నేత పాత్ర పైన అనుమానాలు ఉన్నట్లుగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ నేత పరారీలో ఉన్నట్లుగా సమాచారం. నాగులుప్పలపాడులో ఉండే వైసీపీ నేత వైసిపి పార్టీ హయాంలో రేషన్ బియ్యాన్ని వ్యాపారంగా చేసేవారని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అలాగే కొనసాగించడంతో ఆయన వ్యాపారానికి వీరయ్య చౌదరి అడ్డుపడ్డారని దీంతో టిడిపి నేతను హత్య చేయించేందుకు ప్రయత్నించారనే విధంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.


ఈ నేపథ్యంలోనే టిడిపి నేతపైన దాడి జరిగినట్లుగా పలు రకాల అనుమానాలు కూడా బయటపడుతున్నాయి. మరొకవైపు ఈ కేసులో నిందితుల కోసం ఏకంగా 12 బృందాలతో పోలీసులు సైతం ఎక్కువగా గాలింపు కొనసాగిస్తూ ఉన్నారు. ఇక మరణించిన టిడిపి నేత వీరయ్య చౌదరి మద్యం సిండికేట్ వ్యాపారిగా కూడా పేరు సంపాదించారట. స్థిరాస్తి వ్యాపారం కూడా చేసే ఈ టిడిపి నేత బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం టిడిపి అధికార ప్రతినిధిగా కూడా గత ఎన్నికలలో పనిచేసినట్లు తెలుస్తోంది.


వీరయ్య చౌదరి ఒంగోలులో ఒక అపార్ట్మెంట్ లోని భవనంలో ఇంటినీ అద్దెకు తీసుకొని మరి వ్యాపారాలను చేస్తూ ఉన్నారట.వ్యక్తిగత పని కోసం హైదరాబాదుకు వెళ్ళిన వీరయ్య చౌదరి మంగళవారం తన కార్యక్రమాలను చూసుకోవడానికి తిరిగి సాయంత్రం వచ్చారట.. రాత్రి 7:35 నిమిషాల సమయంలో ద్విచక్ర వాహనం పైన కొంతమంది మాస్క్ కట్టుకొని వచ్చిన దుండగులు వీరయ్య చౌదరిపై కత్తులతో దాడి చేసి చాతి, గొంతులో పొట్టలో 15 సార్లు పొడిచారట. అయితే కేవలం అక్కడ వీరయ్య ఆఫీస్ బాయ్ మాత్రమే ఉన్నారట. భయంతో ఆఫీస్ బాయ్ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారందరూ రావడంతో నిందితులు ఆ యువకుడిని కత్తితో బెదిరించి పరారయ్యారట. ఆస్పత్రికి తీసుకువెళ్లే సమయంలో వీరయ్య చౌదరి  మృతి చెందినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: