ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సరికొత్త ఫార్ములా తో ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత... పార్టీలో సీనియర్ నాయకులు అలాగే కష్టపడ్డ వారికి అన్యాయం జరిగిందని గుర్తించిన వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అలర్ట్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఓటమి చవిచూసిన నేపథ్యంలో.... కొత్త ఫార్ములా తో ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగానే అన్ని పనులు చకచకా చేసేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి.

 ఎన్నడూ లేని విధంగా పార్టీలో ఉన్న సీనియర్ అందరికీ పదవులు ఇస్తున్నారు. పార్టీలో ఉన్న సీనియర్లకు పెద్దపీట వేస్తున్నారు జగన్. వాళ్లకు పూర్తిగా స్వేచ్ఛ ఇవ్వడమే కాకుండా... వాళ్లను కూడా నిర్ణయాలు తీసుకొని తనకు చెప్పాలని స్పష్టం చేస్తున్నారు. కొన్ని సమయాల్లో సీనియర్లకే వదిలేస్తున్నారు. వాళ్లే పార్టీని నడిపించాలని కూడా ఆదేశిస్తున్నారు.

 అలాగే అన్ని జిల్లాలకు అధ్యక్షులను కూడా నియమిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అన్ని నియోజకవర్గాల స్థాయిలో ఇన్చార్జిల ను కూడా సమర్ధులను తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. అదే సమయంలో.. ఇకపై పార్టీ క్యాడర్ కోసం.. రోజుకు గంట లేదా రెండు గంటలు... కేటా యించాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నారు. వాళ్లతో మాట్లాడిన తర్వాతే తదు పరి కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నారు. అలా చేస్తే గ్రౌండ్ రియాల్టీ తెలుస్తుందని జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారట.

 అలాగే వై యస్ జగన్మోహన్ రెడ్డి కి సరికొత్త టెక్నిక్ ఉంది. అదే ఏపీ ప్రజలతో ఎలా కనెక్ట్ కావాలన్నది. 2019 ఎన్నికల సమయంలో.... ప్రజలతో బాగా కనెక్ట్ అయి 150 కి పైగా సీట్లు తెచ్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇక ఇప్పుడు ప్రతి గడప గడప తిరగాలని అనుకుంటున్నారు. అలా చేస్తే మళ్లీ 2029లో వైసీపీ జెండా ఎగురవేయడం గ్యారంటీ అనుకుంటున్నారు. ఈ మేరకు రంగం సిద్ధం చేస్తున్నారు వై యస్ జగన్మోహన్ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: