వైసిపి నుంచి ఎట్టకేలకు దువ్వాడ శ్రీనివాస్‌ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ఇంత హఠాత్తుగా ఎందుకు తీసుకున్నారు అన్నది వైసిపి నేతలకు అర్థం కావడం లేదు. వైసిపి నుంచి ఇతర పార్టీలలో చేరేందుకు రాజీనామాలు చేసిన ఎమ్మెల్సీలు రాజీనామాలు ఆమోదించడం లేదు. కానీ పిల్లలు పుడితే జగన్ పేరు పెట్టుకుంటామని చెబుతున్న దువ్వాడ ను మాత్రం ఎమ్మెల్సీ పదవి లో ఉండగానే సస్పెండ్ చేశారు. దీనికి చాలా కార‌ణాలు ఉన్నాయ‌న్న గుసగుసలు వినిపిస్తున్నాయి. దువ్వాడ శ్రీనివాస్ ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా ఒక్కసారి కూడా గెలవలేదు. జగన్ ఒకసారి ఆయనకు శ్రీకాకుళం ఎంపీ సీట్లు కూడా ఇచ్చారు. ప్రతి ఎన్నికలలో ఆయనకు టికెట్ ఇచ్చేందుకు ప్రధాన పార్టీలు పోటీ పడేవి. ప్రజారాజ్యం ఆవిర్భావం తర్వాత ఒకసారి టెక్కలికి ఉప ఎన్నిక‌ వస్తే అన్ని ప్రధాన పార్టీలు ఆయనకే ఆఫర్లు ఇచ్చాయి .. అలాంటి బలమైన నేత ఇప్పుడు ఎవరికి కాకుండా పోయారు. కామెడీ స్టార్ అయిపోయాడు. వైసీపీలోకి వెళ్ళాక దువ్వాడ శ్రీనివాస్ కు ఆ పరిస్థితి వచ్చేసింది.


వైసిపి అధికారంలో ఉన్నప్పుడు దువ్వాడ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయాడు. అచ్చం నాయుడు మీద .. ఎర్ర నాయుడు కుటుంబం మీద చేసిన విమర్శలు .. దాడులు చాలా ఉన్నాయి. జగన్ ప్రమోట్ చేసి ఎమ్మెల్సీ పద‌వి ఇచ్చారు. తీరా ఇప్పుడు ఆయన పాతాళానికి పడిపోయారు. వివాహేతర సంబంధం పెట్టుకుని భార్య .. పిల్లలపై బూతులతో విరుచుకుపడిన జగన్ పట్టించుకోలేదు .. కానీ ఇప్పుడు జగన్ కంటే దువ్వాడకే ఎక్కువ పబ్లిసిటీ వస్తోంది. దువ్వాడ తన సహజీవన భాగస్వామి మాధురితో కలిసి ఒకేసారి వేరువేరు చోట మాట్లాడితే ఆయన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా దువ్వాడ ఇప్పుడు నట్టేట మునిగిపోయినట్టే .. ఆయన రాజకీయ జీవితం కూడా దాదాపు శుభం కార్డు పడినట్టే అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: