
వైసీపీకి చెందిన మహిళా నాయకురాలు .. ఆ పార్టీ మాజీ మంత్రి విడదల రజనీ మరిది విడదల గోపీని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. విడదల రజనీ అధికారంలో ఉండగా .. తన వదిన పదవులను అడ్డం పెట్టుకుని చిలకలూరిపేట తో పాటు జిల్లా లో కొన్ని చోట్ల గోపీ ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. 2019 ఎన్నికలకు ముందు గోపీతో పాటు రజనీ ఫ్యామిలీ తో కలిసి వైసీపీ లోకి వెళ్లారు. ఆ తర్వాత రజనీకి చిలకలూరిపేట అసెంబ్లీ సీటు రావడం.. ఆ తర్వాత ఆమె ఎమ్మెల్యే గెలిచిన వెంటనే గోపీ ఆగడాలు మొదలయ్యాయన్న విమర్శలు అప్పట్లో తీవ్రంగా వచ్చాయి.
ఆ తర్వాత మునిసిపల్ ఎన్నికల్లో గోపీ కౌన్సెలర్ గా విజయం సాధించారు. రజనీ కూడా తన మరిదిని చిలకలూరిపేట మునిసిపల్ చైర్మన్ చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. అయితే జగన్ అందుకు ఒప్పుకోలేదు. ఆ తర్వాత రజనీకి మంత్రి పదవి రావడంతో వీరి ఆగడాలు శృతి మించాయన్న విమర్శలు స్థానిక ప్రజలు .. ప్రతిపక్ష నేతల నుంచి వచ్చాయి. చిలకలూరిపేట నియోజకవర్గంలోని యడ్లపాడు లోని క్రషర్ కంకర క్వారీ యజమానుల ను బెదిరించి అక్రమంగా డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణల నేపథ్యం లోనే గోపీని అరెస్టు చేసినట్టు సమాచారం. ఈ విషయం లో గోపీ తో పాటు మాజీ మంత్రి రజనీ పై సైతం కేసు నమోదు అయ్యింది.
ఈ వాట్సాప్ నెంబర్‌తో సమస్య మీది.. పరిష్కారం మాది..
అవినీతి అయినా.. లంచాలైనా.. రాజకీయ నాయకులు పెట్టే ఇబ్బందులు అయినా మీ సమస్యను మా సమస్యగా భుజాన వేసుకుంటాం. నేతలు పట్టించుకోవడం లేదని.. అధికారులు దురుసుగా వ్యవహరిస్తున్నారని చింతించాల్సిన అవసరమే లేదు. రండి.. చేయి చేయి కలుపుదాం.. మీ చింత తీర్చుదాం. మీ సమస్య ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.. పరిష్కార మార్గాన్ని పొందండి.