జనసేన పార్టీ అధినేత ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు తాజాగా సైలెంట్ మూడో లో ఉన్నట్టు కనిపిస్తోంది.. ఒకవైపు పిఠాపురంలో చూస్తే మల్లాం గ్రామంలో దళితులను బహిష్కరించారు. ఇప్పుడు పిఠాపురంలో కూడా రాజకీయరంగు మారుతోంది. అయితే ఈ విషయం పైన అక్కడ జనసేన ఇన్చార్జ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరో అజ్ఞాత దుష్టశక్తి ఈ విధంగా చేశారంటూ తెలియజేశారు.. అదృష్ట శక్తిని బయటకి తేవాలి చట్టం ముందు నిలబెట్టాలి కదా అంటూ అక్కడి వాసులు అడుగుతున్నారు.



అంతేకాకుండా దళితులను దూరంగా పెట్టడం కిరానా షాప్ కి రానివ్వకుండా ఉండం ఇదంతా కూడా 21వ శతాబ్దంలో ఉన్నది. కానీ అలాంటిది ఇప్పుడు మళ్ళీ జరుగుతూ ఉండడంతో అసలు పిఠాపురంలో ఏం జరుగుతుందో అన్నది చర్చనీయంశాంగా మారింది. అయితే ఈ విషయంలో అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న పవన్ కళ్యాణ్ నుంచి ఎలాంటి ప్రకటన కూడా రాకపోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అసలు పవన్ సైలెంట్ ఉండడం పట్ల చాలామంది వివక్షాలు విమర్శిస్తూ ఉన్నారు. తన సొంత నియోజకవర్గంలో ఇలాంటివి జరుగుతూ ఉంటే ఎమ్మెల్యే జోక్యం చేసుకోలేదా అంటూ విమర్శిస్తూ ఉన్నారు.


అయితే కొంతమంది జనసేన కార్యకర్తలు మాత్రం పవన్ కళ్యాణ్ ఆరోగ్యం బాగోలేదని తెలియజేస్తూ ఉన్నారు. మరి కొంతమంది మాత్రం ఈ విషయంపై మెగా బ్రదర్ ఎమ్మెల్సీ నాగబాబు కూడా పిఠాపురానికి వెళ్లి మరి ఈ వ్యవహారం చెక్కపెట్టాల్సింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై మల్లాం  గ్రామానికి వెళ్లిన వైసిపి ఇన్చార్జి గీత సందర్శించి ఆ దళితుల కుటుంబాలను కూడా పరామర్శించారట. ఈ విధంగా చూసుకుంటే అక్కడ సామాజికంగా కోణంలో కూడా ఇబ్బందికరంగా ఉన్నది ఉప ముఖ్యమంత్రి పోటీ చేసిన నియోజవర్గం నుంచి ఇలాంటి ఇబ్బందులు ఎదురవ్వడంతో మరి ఏపీ పరిస్థితి ఎంత అంటూ రాజకీయాన్ని చేస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: