యూనివర్శిటీలంటే విద్యాక్షేత్రాలు.. అందులోనూ పరిపక్వత ఉన్న యువత తమ భవిష్యత్తుగా బాటలు వేసుకునే చోటు. అలాంటి యూనివర్శిటీ ఆధ్వర్యంలో విచ్చలవిడిగా, జుగుప్సాకరంగా శృంగార కార్యకలాపాలు చోటుచేసుకోవడం సంచలనం సృష్టిస్తోంది. అందులోనూ యూనివర్శిటీ అధికారికంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇలాంటి పోకడలు అందరినీ విస్తుగొలుపుతున్నాయి.
యూనివర్సిటీ ఆఫ్ హల్స్ ఆధ్వర్యంలోని నైట్‌క్లబ్ లేటెస్టుగా జరిగిన ఓ పార్టీలో కుర్రకారు రెచ్చిపోయారు. ఏకంగా స్టేజ్ పైనై శృంగారం చేస్తూ విచ్చలవిడిగా బిహేవ్ చేశారు. పుస్తకాలు పట్టుకుని చదువుకోవాల్సిన విద్యార్థులు క్లబ్‌లో తాగితందనాలాడారు. యూనివర్శిటీ మెంబర్ల సమక్షంలోనే బహిరంగంగా సెక్స్ జరిపేశారు. అందులోనూ యువ జంటలు పోటీ పెట్టుకుని మరీ రెచ్చిపోయారు.
ఈ వీడియోలు, ఫోటోలు బయటకు రావడంతో సదరు యూనివర్సిటీపై అంతటా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కట్టడి చేయాల్సిన వారే ప్రోత్సహిస్తుంటే కుర్రకారు రెచ్చిపోకండా ఆగుతారా.. విచ్చలవిడితనానికి పరాకాష్టగా నిలచిన ఈ ఘటన ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు ఊపందుకుంటున్నాయి.