భారతీయ జనతాపార్టీ కి ఆంధ్ర ప్రదేశ్ లో ఎదగటానికి చక్కటి ప్రణాళిక తో ప్రయత్నిస్తే అద్భుత విజయావ కాశాలున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ ఒక జన్మకు సరిపడా వృద్ధిలోకి వచ్చే అవకాశాలు లేవు. వైసిపి కి కావలసినంత అప్రతిష్ట ఉంది. వైఎసార్ మరియు జగన్ ల నేరచరిత్ర నుండి, వారి కుటుంబ అవినీతి కూపం నుండి బయటపడటం అంత తేలిక కాదు. ప్రజా విశ్వాసం లేకపోవటమే గత ఎన్నికల్లో వైసిపి పరాజయానికి కొంత కారణం. ఇక పోతే కమ్యూనిస్టులెప్పుడూ ఉద్యమాలకు మాత్రమే పరిమితమై పోతున్నారు. విశ్వవ్యాప్తంగా కమ్మ్యూనిజం మంచి పరిపాలనా విధానంగా రూపొందలేదు. ఒక్క చైనా లో ఉన్నా, అది నిరంకుశంగానే ఉంది.
ఇక తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే, కౌరవ సభలోని దుష్టచతుస్తయానికి ఎక్కువ రాక్షసామాత్య విధానాలకు సరిసమానంగా నాయకమ్మన్యుని సేవలోనే ఆ ప్రజాప్రతినిధులు తరిస్తున్నారు. ఈ పార్టీ ఎంత మాత్రమూ క్షమించరానంత అపకీర్తిని ఈ రెండేళ్ళలో మూటకట్టుకుంది. ఎం.ఎల్.ఏ ల "హార్స్ ట్రేడింగ్" ద్వారా “ఓట్ కు నోట్” కేసులో ఇరుక్కున్న తెలుగు దేశం నాయకుడు చంద్రబాబు నాయుడు ఇంకా అధికారములో ఉన్నారంటే, సీమాంద్రలో సరైన రాజకీయ ప్రత్యామ్నాయం లేకపోవటమే. ఈ రాజకీయ శూన్యతను పూరించి అధికారములోకి రావటం మరిచిపోయింది భారతీయ జనతా పార్టీ.
ఓటుకు నోటు,
అమరావతి నిర్మాణక్రమములో పారదర్శకత లేక పోవటం,
సింగపూర్ సింగపూర్ అంటూ భారత యువత (సీమాంద్ర యువత ను కలుపుకొని) నైపుణ్యం మురికి వాడల నిర్మాణానికి మాత్రమే సరిపోతారని కించపరచటం,
ఎవరు కావాలని ఎస్.సి-ఎస్.టి లు గా పుట్టాలనుకోరని ఆ వర్గాలను కించపరచటము కుల అహంకారాన్ని ప్రదర్శించటం,
కాపులకు ప్రత్యేక రిజర్వేషన్ల ఆశచూపి, కొంగ్రొత్త ఆశలు వారిలో రేకెత్తించి ఎన్నికల్లో అధికారములోకొచ్చిన, తరవాత వారి ఆశలను ఒక్క సారిగా కుప్పగా కూల్చివేసి, వారి నాయకుణ్ణి అవమానించిన వైనం,
అసలే అమరావతి కులాల ప్రాభల్యంతో కుతకుతలాతే ప్రాంతం. దానికి తోడు టిడిపి ప్రమేయంతో పుట్టుకొచ్చిన కుల, మత, ప్రాంత విభేదాలు తారస్థాయికి చేరి ఇల్లు కిరాయకి కావాలన్నా మీ కులమేమిటి? అనే ప్రశ్న అతి సాధారణంగా ఉద్భవిస్తుంది. అంతగా కులపైత్యం ముదిరిందక్కడ.
కల్తీ, మద్యం, ఇసుక, భూమి, కాల్-మనీ, దాని వడ్డీ తో పుట్టుకొచ్చిన లైంగిక హింస, తద్వారా అమరావతి అంతా పుంజుకున్న ఉమన్ ట్రాఫికింగ్ లాంటి మాఫియాల వలయములో చిక్కుకున్న "అమరావతి బ్రాండ్ -వాల్యూ" ధారుణంగా పడిపోవటం,
అక్కడి భూములను అధినేతల బినామీలే "ఇన్సైడర్ ట్రేడింగ్" ద్వారా కొనేసి ముందుతరాల్లో వారి కులానికే చెందిన కొత్తవారికి గాని, పూర్తిగా ఇతర కులాల వారికి అక్కడ స్థానం లేకుండా చేసిన దుర్మార్గం,
భూ సేకరణలో అత్యధికంగా విపక్షాలవారికి, నిరుపేదలకు చెందిన భూమిని హస్తగతం చేసుకుని ప్రాంతీయ ఆధిపత్యాన్ని, కుల ఆధిపత్యాన్ని పదింతలు చేసి – ఇతరులకు ఏమాత్రం అమరావతి సీమాంద్రులదనే భావనే లేకుండా చేసిన మోసం, దగా ఆ పార్టీని మిగతా ప్రజలనుంది దుర్భేధ్యమైన గోడకట్టినట్లు విభజిస్తున్న పరిస్థితి ప్రభావం భవిష్యత్తులో ప్రాంతీయ, కుల అసమానతలకు దారి తీసే దిరధృష్టకత వాతావరణం అమరావతి పునాదుల నుంచే ఆవిష్కరించబడు తున్నాయి.రోజురోజుకు ఈ పునాదులు బలపడుతున్నాయి. ఎంతగా అంటే ట్రంప్ అమెరికా జాత్యాహంకారాన్ని మించి.
అమరావతి తప్ప వెరేమీ ఆలోచించని టిడిపి కి మిగతా ఉత్తరాంద్ర, రాయలసీమ, "కృష్ణ, గుంటూరు జిల్లాలు" తప్ప మిగతా అంధ్రా జిల్లాల ప్రాంత ప్రజా వ్యతిరేఖత వెల్లువ అయ్యే అవకాశం స్పష్టంగా ధృశ్యం ఇప్పుడే కళ్ళకు కటినట్లు కనిపి స్తుంది.
ఎన్నికల మానిఫేస్టోలో చేసిన వాగ్ధానాలు, రైతుఋణ మాఫీ ప్రక్రియలోని అవకతవకలు, ప్రయోజలు కొన్నే ఐనా అవి అన్నీ టిడిపి కార్యకర్తలకే చేరటం,
అమరావతి ని సి.జి వర్క్ లో బాహుబలి మాహిష్మతి నగరములా చూపినట్లు నిర్మించాలనటే దానికి ఐదు లక్షల కోట్లు ఖర్చయ్యే అలవికాని దురాశా పూరిత ప్రణాళికలు సిద్ధం చేయటం,
అందులో మన దేశప్రజల, యువత భాగస్వామ్యం కంటే పదే పదే సింగపూరు జొప్పించటం నాయకత్వాని కి సీమాంద్ర కంటే సింగపూర్ ప్రయోజనాలే ముఖ్యమనే భావన మనసుల్లో పాతుకొని పోవటం, ఆయన సింగపూర్ అధ్యక్షుడా? ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రా? అనే అనుమానం ఎల్లవేళలా ప్రజలకు పొడచూపుతుంది.
స్వార్ధ ప్ర్యోజనాల సాధన కోసం భారతదేశం వెలుపల మూడు సంవత్సరాల నిర్మాణ అనుభవాన్ని – అర్హతగా ప్రవేశపెట్టి సింగపూరు కాంట్రాక్టర్ల గ్రూపు లో తన అనుకూల కంపెనీలను భాగస్వాములుగా దొడ్డిదారిలో చేర్చి,
తద్వార విదేశీ ఆస్థులను పెంచుకొనే అత్యంత ప్రమాదకర ప్రజా దోపిడీ ని, స్కాములు ఉన్నయనే అనుమానాలున్న తరుణములో "స్విస్-చాలెంజ్ అనే అనేక రంద్రాలున్న ప్రణాళికను" అమోదించటమే కాకుండా ముందుగానే సింగపూర్ ప్రభుత్వ ప్రమేయములేని ప్రయివేట్ కంపనీలతో ఎం.ఓ.యూ లను రచించి పెట్టుకోవటం-ఇవన్నీ తెలుగు ప్రజలు టిడిపి పై ఉంచిన నమ్మకాన్ని పూర్తిగా బలహీన పరచుకోవటం ఆ పార్టీ నాయకత్వము మదిలోని "దీపము ఉండగానే ఇల్లు చక్కదిద్దుకొని సింగపూర్ కుటుంబము తో సహా చెక్కేద్ధాం" అనేతరహా పరిస్థితి కనిపిస్తుంది.
"ఓటు కు నోట్" కేసు ద్వారా బలహీనమై, స్విస్-చాల్లెంజ్ లో బ్రద్ధలైన అవినీతి భాగోతాన్ని, అధికార, రాజ్యాంగ వ్య్వస్థల దర్యాప్తులను ఎదుర్కొనే నిజాయతీ, ధమ్ము, ధైర్యం, ఋజువర్తన లేక – దాన్ని అడ్డు కోవటానికి న్యాయస్థాల్లో కేసుల విచారణ నిలుపుదల (స్టేస్) ఉత్తర్వులు తెచ్చుకోవటం కేసుల విచారణ వాయిదాలు వేయించుకోవటం, కేసును నీరుగార్చే తలంపు తద్వార అక్కడ కూడా దగా చేసే స్థితి జరుగుతుంది. ఇదంతా నాయకుని నేరాలకు సాక్షీభూతాలుగా నిలుస్తాయి.
పైవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. నేరాలు చేసిన అధికార పార్టీ సభ్యులను, తస్మదీయులను తామే తప్పించి అమాయకులను ఇరికించటం ఇవన్నె రాస్తే కొన్ని వాల్యూముల విశ్లేషణలు రాయటం అవసరమౌతాయి. ఈ విధంగా టిడిపి ప్రాభవం దాదాపు అవరోహణ క్రమంలో నీచ స్థితికి దిగజారి క్రమంగా నశించే పరిస్థితి గోచరిస్తుంది. అవసానదశకు చేరే దృశ్యం మన కళ్ళ ముందే ధ్యోతక మౌతుంది. సింగపూర్ మెప్పు కోసం బౌద్ధానికి అమరావతి లో విస్తృత ప్రచారం ప్రారంభించారు బాబు.
"ప్రత్యేక పాకేజీని, ప్రతిపత్తికి ఇంకొంచేం దగ్గర చేస్తూ" విస్తృత పరిస్తే, “బాబుగారి కులేతర ప్రజా వర్గాలను” కలుపుకొంటే, కొంచేం కాపులను, రెడ్లు తదితర అగ్రకులాలను వెలుగులోనికి తెచ్చి రాజకీయంగా భా.జ.పా. ఆంధ్రప్రదేశ్ లో ఆధిఖ్యత సాధించటానికి ప్రయత్నం చేయటం అవసరం. సరైన పటిష్టమైన నాయకత్వ నిర్మాణమే ఈ పనిని దిగ్విజయముగా అనుకున్నట్లుగా ముగించ గలుగుతుంది.
టిడిపి బాజపాకు నమ్మకమైన మిత్రులు కాదు. ఎప్పుడూ ఆ కాపురములో అనేక కలతలు, అనుమానాలు, అవకాశవాదమే కనిపిస్తుంది. అదే ఆనుపానులుగా తీసుకొని బాజపానే ముందుగా ఈ మైత్రికి "బ్రేక్" వేయటం మంచిది. అదే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ శూన్యతను భర్తీ చేస్తుంది.
చివరగా పవన్ కళ్యాన్: జనసేన అన్నా, పవన్ కళ్యాణ్ అన్నా ప్రస్తుతానికి ఒకటే. ఇప్పటికే పవన్-ప్రభ కొంత కుళ్ళి కునారిల్లింది. ఏదో రెండేళ్ళ కొకసారి ప్రశ్నిస్తానంటూ వచ్చి సభలు పెట్టి “ “లడేంగే, లడేంగే జీత్నే తక్ లడేంగే” అంటూ తాను ఈ మధ్య నేర్చుకున్న హిందీ లో కెవ్వు మంటూ కేక లేసి మళ్ళా సినిమా ధ్యానములోకి వెళ్ళి పోయే సంస్కృతి ఆయనది. మళ్ళా ఎన్నికల ముందు నిద్రలేస్తారు రావణలంక లో కుంభకర్ణునిలా అప్పటివరకే ఆయన గారి లీలలు, వివాహాలు, ఆయన సినీ జీవితములో నిర్మాతలూ, దర్శకులు, పంపిణీదారులు ఎలా ఆయన నిర్లక్ష్యపు ప్రవర్తన తో మునిగిపోయారో ఒక రికార్డ్ సిద్దం చేసి సింపుల్ గా "సైడ్ లైన్" లొకి తోసెయ్యొచ్చు.
గతములో తన అన్నగారి ప్రజారాజ్యానికి – తోక గా ఉన్న "యువరాజ్యం" లో ఆయనేమైనా సాధించింది ఉందా? ఆయన కోటి రూపాయల విరాళముతో (చెక్కు బౌన్స్ అయిందని వార్తలొచ్చాయి) ప్రారం భించిన సేవా సంస్థ "కామన్ మాన్ ప్రొటక్షన్ ఫోర్స్", దానికి వచ్చిన విరాళాల లెక్కల సంగతి ఆరా తీస్తే చాలు, సారుగారి సరాగాలు వాటి చరిత్ర బయటపడొచ్చు. బాజపాకు ఇవన్నీ ఉగ్గుతో పెట్టిన విద్యలు. ఇప్పటికే అఖండులనదగ్గ మన ఇద్దరు చంద్రులు మోడీ, వెంకయ్యలకు సలాం చేస్తూ "నీకాల్మొక్కుత నీ బాంచన్ దొరా" అనే లెవల్లో బానిసలయ్యారని లోఅం కోడై కూస్తుంది.
భాజపా ని పట్టుదలతో సరిగా మరోసారి లాంచ్ చేసి ప్రజల ఆకాంక్షలను నెరవేరే ప్రణాళికతో ముందుకెళితే చాలు “ఎక్కడిదొంగలు అక్కడనే గుప్-చుప్” అంతే కాదు చంద్రబాబే ప్రత్యేక ప్రతిపత్తి సంజీవని కాదన్న విషయాన్ని (తెలుగుజాతి ఎన్నటికీ మరువదు) విశేష ప్రచారమిచ్చి వెలుగులోకి విస్పోఠనంలా తెస్తే చాలు టిడిపి అంతటితో సరి. ఆయన ప్రోద్భలముతో నే “ప్రత్యేక పాకేజీ” ని సుజనా చౌదరి-వెంకయ్య నాయుడు జేట్లీ తో కలసి సిద్ధం చేసినది తెలుగు జాతి టెలివిజనులో వీక్షించిన చిత్రాలు ప్రజల మనోనేత్రాల నుండి జారిపోనేపోవు. టిడిపి అధినాయకత్వం చేసే శకుని రాజకీయాలకు బాజపా ఈ మాత్రం గుణపాథం చెప్పటం నేరం కాదు. తెలుగు జాతి పది సంవత్సరాల రాజధానిగా హైదరాబాద్ ను పంచుకొనే అవకాశాన్ని, వందల్లో విశ్రాంత జీవితములో పడి హౌదరాబాద్ లోనే స్థిరపడాలనుకున్న ఉద్యోగుల ఆశలపై ఒక్క నాయకత్వ స్వార్ధం "ఓటుకు నోట్" తో ఐదు కోట్ల ప్రజల జీవితాలను అంధకారములోకి త్రోసివేసిన ఆ తెలుగుదేశం పార్టీకి ఈ మాత్రం గుణపాఠం చెప్పటం నేరమేమీ కాదు.