మన ప్రజలకు ప్రజాస్వామ్యం లో జీవించటం ఇష్టం లేదనుకుంటా! అసలు ప్రజాస్వామ్యం లో ఉండి దాన్ని అనుభవిస్తూ అద్భుతమైన పాలనానుభూతి ని పొందాలని ప్రతి పౌరుడు భావించాలి. ఎందుకంటే ఇక్కడ ప్రతి వయోజనుడూ రాజే. ప్రతి ఓటు హక్కు ఉన్న పౌరుడు తనను తానే రాజుగా భావించే స్థైర్యం కలిగి ఉండాలి. అప్పుడే ప్రజాస్వామ్య లక్ష్యం నెరవేరు తుంది. ఎన్నికల్లో మనచే ఎన్నుకోబడ్ద ప్రతి నాయకుడూ ప్రజాసేవకుడే.
శాసనసభ ను ప్రజలు నిర్దేశించాల్సిన చోట ఈ సేవకులు పల్లకీలు ఎక్కటమే కాదు ప్రజల చేత, కాదు కాదు రాజుల చేత దాన్ని మోయించటం ఎంత ఘోరం. అంతటితో అయిందా? అంటే, అదీ లేదు ఈ సేవకుల కొడుకులు చివరకు చడ్దీ వేసుకోనే వయసు కూడా లేని, వాళ్ళ మనవళ్ళు వారసులని 2040 లో “సో అండ్ సో” మనవడే ఆంధ్రప్రదేశ్ ని పరి పాలిస్తాడని, ప్రతి సోంబేరు ప్రజా నాయకుడు ఆ మనవడి చంకేం ఖర్మ ఇంకేమైనా నాకటానికి సిద్ధంగా ఉన్నారు. అంటే బానిస వంశ సంభూతుల్లా ప్రజా ప్రతినిధులు ప్రవర్తిస్తూ ఉండటం భారత ప్రజాస్వామ్యం లో నెలకొన్న ధారుణ పరిస్థితు లకు అద్దం పడుతున్నాయి. దీన్నిబట్టి బాహుబలి సినిమాలో లగా ప్రజలు, శాసనసభ్యులు, అధికారులు, చివరకు చంచా మీడియా కూడా కట్టప్ప పాత్రే ముఖ్యమంత్రుల పట్ల పోషిస్తున్నారని చెప్పవచ్చు.
ఈ దేశం ప్రజాస్వామ్య దేశం సేవకులైన పాలకులు దోచుకెళుతున్నా విదేశాల్లో మనదేశం సొమ్ముతో కులుకుతున్నా ఈ రాజు లనే ప్రజలకు దానిపై వ్యాఖ్యానించే పాటి శ్రద్ధలేదు. ప్రతివాడు వాడి పబ్బం గడిస్తే చాలు అనేలా బ్రతికే స్వార్ధపరులకు ప్రజాస్వామ్యం అక్కర్లేదు. ఎవడో ఒక సార్వభౌముడు ఉండి వాడి మనసుకు తగ్గట్టు రాచరిక పాలన చేస్తే వాడి మోచేతి నీళ్ళు తాగి బ్రతకటం సహస్రాబ్ధాలుగా అలవాటైంది. మన ప్రజలు స్వాతంత్రం దాని ఫలితాలు అనుభవించే అలోచన గాని అంతకుమించిన భాధ్యతను తీసుకుని హక్కులకోసం పోరాడే ఓపిక లేని సోమరిపోతులు.
ఉదాహరణకు ఒక నేరస్థురాలుగా భారత సర్వోన్నత న్యాయస్థానములో ధృవీకరించబడ్ద దివంగత జయలలితకు ఇంకా నీరాజనాలు పట్టే జనవాహిని తో తమిళ ప్రజ తడిచి పోతుంటే అక్కడ తనకు తాను వారసురాలుగా ప్రకటించుకున్న శశికళ అనే (అ) ప్రజాసేవకి తో 33 సంవత్సరాలు స్నేహం మాత్రమే వారసత్వ అర్హత యివ్వటమనేది అత్యంత జుగుప్సాకరమైన విషయం. అసలామే జయలలిత చెలియో, చెలికత్తో, ఇంట్లో పని చేసిన సేవకో, ఇంకా ఆమె అవినీతిలో ఈమె భాగస్వామో లేక ఈమె అవినీతి కి ఆమె అండదండలు అందించి రాష్ట్రం మొత్తం దోచుకున్నా, తిరిగి అలాంటివాళ్ళ వారసులకోసం వేచి చూసే ప్రజలను బానిసలు అనగలము కాని రాజులు అనగలమా! బానిసలకే బానిసలని చెప్పవచ్చు గదా!
ఒక నేరగ్రస్థ ప్రజానాయకురాలు, ముఖ్యమంత్రి జయలలిత కు మరో భయానక “మన్నార్గుడి మాఫియా” నాయకురాలు శశికళ, ఆమెకై ఆమె వారసురాలు అని ప్రకటించుకొని ముఖ్యమంత్రి పీఠం అదిష్టించ ప్రయత్నిస్తే ఏమి ప్రశ్నించలేని ప్రజలు న్న ప్రజాస్వామ్య రాజ్యం కూల్చటానికా! కాల్చటానికా! ఏ రాజ్యాంగ వ్యవస్థా దీన్ని నియంత్రించలేక పోవటం ఇక్కడి ప్రజ దురదృష్టం. శాంతి భద్రతల పేరుతో ప్రజలును మాత్రమే అణచివేయగల పోలీసు అధికారులు, ఇతర పాలనా సంబంద కార్యదర్శుల కు సమాజంపై బాధ్యత లేదా! రాజ్యాంగం ప్రసాదించిన ఆదేశ సూత్రాలు మంటగలిసి పోయాయా? అవినీతిలో ఆసియా ఖండానికే పెద్దన్న అయిన భారత్ కు ప్రజానీకానికి సిగ్గులేని దుర్గతులు దాపురించడానికి కారణ మెవరు?
ఒక తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి మనవడు తాతగారు వెంట రాకుండానే సచివాలయము లోనికి ప్రవేసించి రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులను అధికారులను ప్రశ్నిస్తూ పరుగులు పెట్టించిన విషయం ప్రజలకు తెలియదా? అయినా అధికారులు ప్రధాన కార్యదర్శితో సహా ఆ కుర్రాణ్ణి అవసరమైతే ముఖ్యమంత్రిని ఈ విషయములో నిలదీయక పోవటమూ విస్మయ పరుస్తుంది.
ఒక సారి వైఎసార్ పాలనలో ముఖ్యమంత్రికి మంత్రిమండలికి సహకరించి పతనావస్థకు చేరిన ఆచార్య, శ్రీలక్ష్మి లాంటి వాళ్ళు చెరసాలల గడప తొక్కినా, దాని నుంచి గుణపాటం నేర్వని — బాద్యతలు నిర్వహించటము లో నిర్లక్ష్యం వహించే అధికారులను ఉపేక్షించటం న్యాయమా? ప్రజలు బానిస లైన వేళ అదిసాద్యమే. కాని ప్రజా స్వామ్య రాజ్యములో ప్రజలు రాజులు కదా! పొంతనలేని ఈ ప్రజాస్వామ్యం భారత్ కు తగదనిపిస్తుంది. ప్రజాస్వామ్యం లో ఎలా జీవించాలో 70 సంవత్స రాల పాలనలో కూడా తెలుసుకోలేని అపరిపక్వ మనస్కులైన ప్రజలకుకు ప్రజాస్వామ్యం ఇంకా అవసరమా?