దేశంలో దొంగలు పలు రకములు..కొంత మంది డబ్బు కోసం చేస్తే..కొంత మంది ఎంజాయ్ కోసం...చేస్తుంటారు.  ఏది ఏమైనా దొంగతనం చేసిన వారు కటకటాల పాలు కాక తప్పదు. మనం గ్రామాల్లోకి వెళితే..అక్కడ చాలా చోట్ల తాటి చెట్లు దర్శనమిస్తుంటాయి.  రోడ్డుకు ఇరువైపులా తాటి చెట్టు ఉండటం మనం చూస్తుంటాం.  ఇక తాటికల్లు అంటే లొట్టలేసుకుంటూ తాగుతారు మద్యం ప్రియులు.  అయితే కొన్ని సార్లు తాటి చెట్టు కల్లు దొంగతనానికి గురిఅవుతుందని గౌడలు ఆరోపిస్తుంటారు.  రాత్రి పూట దొంగలు తాటి చెట్టు కల్లు దొంగిలించడం లేదా..లొట్లు ధ్వంసం చేయడం లాంటివి చేస్తుంటారు.  
Image result for thati trees
దీంతో గౌడలు ఎంతగానో నష్టపోతుంటారు..వారి జీవినోపాదికి గండిపడిందని కన్నీరు పెడుతుంటారు.  తాజాగా తాటిచెట్టుపై అపహరణకు గురవుతున్న కల్లును కాపాడుకునేందుకు ఓ గీత కార్మికుడి చేసిన పని చూస్తే అందరూ ముక్కున వేలు వేసుకున్నారు.  వరంగల్‌ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలంలోని అవుసలికుంట తండాకి చెందిన నారాయణగౌడ్‌ కల్లుగీత కార్మికుడు.  కల్లు విక్రయం ద్వారా వచ్చే  డబ్బుతో తన కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. అయితే గత కొంత కాలంగా  రాత్రి వేళల్లో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు.. తాటి చెట్టు ఎక్కి కల్లును తస్కరిస్తుండటం సహా కుండలనూ ధ్వంసం చేస్తున్నారు.  
Related image
ఈ బాధ భరించలేక నారాయణగౌడ్ ఓ అద్భుతమైన ఆలోచన ఆలోచించాడు. పాత ఇనుప రేకుపై ఇలా ముళ్లతో పాటు ప్రత్యేకంగా తాళం బిగించే ఏర్పాటు చేయించాడు. ఉదయం, సాయంత్రం వేళల్లో తాను కల్లు సేకరించిన అనంతరం ఆ రేకును తాటిచెట్టు మధ్యభాగంలో నారాయణగౌడ్‌ ఇలా అమర్చుతున్నాడు. ఇలా చేయడం వల్ల కొంత కాలంగా దొంగతనం ఆగిపోయిందట.  ప్రస్తుతం రహదారి మీదుగా వెళ్లే ప్రతిఒక్కరూ ఈ తాటిచెట్టుకు ఉన్న రక్షణను చూసి ఆశ్చర్యపోతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: