పాకిస్థాన్ ఒక దుష్ట సర్పం. ఆ సర్పాన్ని ఏడు దశాబ్ధాలుగా పాలు పోసి పెంచుతుంది భారత రాజకీయ వ్యవస్థ. మన పాలు తాగుతూనే తొలి నుంచీ విషం కాదు గరళం చిమ్ముతూనే ఉంది. కాని అదిప్పుడు కాలకూట విషమైంది. ఆ పాపిస్థాన్ నాలుగు సార్లు మనపైన చేసిన దాడిని భారత్ అసమాన ప్రతిభతో ఎదుర్కొంది. భీకరంగా భారత సైన్యం యుద్ధం చేసింది పాకిస్తాన్ ను పతనం వైపు నడిపింది.
సర్వం కోల్పోయిన పాక్ బిక్కచచ్చి ప్రపంచం ముందు ముద్దాయిలా నిలిచినా మన పిచ్చి నాయకులు "జవహర్లాల్ నెహౄ నుండి నిన్నటి మన్మోహన్ వయా వాజ్-పేయీ" వరకూ అందరూ అతి మంచితనం ప్రదర్శించారు. యుద్ధములో గెలిచీ పాక్ ఆక్రమించిన మన కాశ్మీర్ భూబాగం కూడా రక్షించుకోలేని క్షుద్ర రాజకీయం మన జవాన్ల త్యాగఫలాన్ని గంగలో కలిపింది.
ఇప్పుడు నరెంద్ర మోడీ నుండి భారత ప్రజలు కోరేది ఒకటే "యుద్దములో శత్రు శేషం మరియు ఋణ శేషం ఉండకుండా" పాక్ ను బాదేయటం తప్ప వేరేసి భారత్ గౌరవం నిలబెట్టదు. పాకిస్థాన్ ప్రపంచపటం మీద నుండి తొలగించే అవకాశాలని మాజీ ప్రధానులు వదిలేసుకున్నారు. మోడీ అలాకాకుండా సుబ్రహ్మణ్య స్వామి చెప్పినట్లు చేస్తే మంచిది.
"కుల్‌భూషణ్ జాదవ్‌కు పాకిస్థాన్ మిలిటరీ కోర్టు విధించిన మరణ శిక్షను అమలు చేస్తే, పాకిస్థాన్ నుంచి బలూచిస్థాన్‌ను వేరు చేసి, ప్రత్యేక దేశంగా గుర్తించాలని" బీజేపీ పార్లమెంట్ సభ్యుడు సుబ్రహ్మణ్యం స్వామి డిమాండ్ చేశారు. కుల్‌భూషణ్ జాదవ్ తర్వాత మరొక దుశ్చర్యకు పాకిస్థాన్ పాల్పడితే ఆ దేశం నుంచి సింధ్ ప్రాంతాన్ని వేరు చేయాలన్నారు. పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పాలంటే ఇదే సరైన పరిష్కారమని తెలిపారు.
కుల్‌భూషణ్‌ను గత ఏడాది మార్చి 3న పాకిస్థాన్ అరెస్టు చేసింది. దౌత్య వర్గాలు సంప్రదించేందుకు కూడా పాకిస్థాన్ అవకాశం ఇవ్వలేదు. ఆయన తమ గూఢచారి కాదని భారతదేశం అనేకసార్లు స్పష్టం చేసినప్పటికీ పాకిస్థాన్ పట్టించుకోలేదు. చివరికి మిలిటరీ కోర్టు ఆయనకు మరణ శిక్ష విధించింది. దీనిపై సుబ్రహ్మణ్యం స్వామి సోమవారం స్పందిస్తూ పాకిస్థాన్‌ను తీవ్రంగా హెచ్చరించాలని డిమాండ్ చేశారు.